close

తాజా వార్తలు

దిగొస్తున్న బంగారం, వెండి ధరలు

దిల్లీ: దేశీయ మార్కెట్లో ఇటీవల అమాంతం దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి. డిమాండ్‌ లేమి, రూపాయి బలపడటం తదితర కారణాలతో వీటి ధరలు దిగొస్తున్నాయి. సోమవారం నాటి బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 300 తగ్గి రూ. 39,225 పలికింది. అటు వెండి కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో రూ. 1400 తగ్గి రూ. 49వేల దిగువకు పడిపోయింది. నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 48,500గా ఉంది. 

అధిక ధరల కారణంగా గత కొంతకాలంగా రిటైల్‌ మార్కెట్లో బంగారం విక్రయాలు తగ్గాయి. దీంతో ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ పడిపోయింది. అటు దేశీయ కరెన్సీ రూపాయి పుంజుకోవడం కూడా ఈ లోహాల ధరల తగ్గుదలకు కారణమైందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల పసిడి ధరకు రెక్కలొచ్చి రూ. 40వేల పైన జీవనకాల గరిష్ఠాన్ని తాకిన విషయం తెలిసిందే. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.