close

తాజా వార్తలు

మార్కెట్‌లోకి శాంసంగ్‌ A50s, A30s

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీ కంపెనీ శాంసంగ్‌ తన A సిరీస్‌లో మరో రెండు కొత్త ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గతంలో విడుదల చేసిన A50, A30కి కొన్ని మార్పులు చేసి A50s, A30s పేరిట కొత్తమోడళ్లను తీసుకొచ్చింది. ఈ ఫోన్లను అటు ఆన్‌లైన్‌, ఇటు ఆఫ్‌లైన్‌లోనూ విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. శాంసంగ్‌ A50s 4జీబీ/128జీబీ వేరియంట్‌ ధరను రూ.22,999గా నిర్ణయించింది. 6జీబీ/128జీబీ వేరియంట్‌ ధరను రూ.24,999గా పేర్కొంది. కేవలం 4జీబీ/64జీబీ వేరియంట్‌లో వస్తున్న A30s ధరను రూ.16,999గా నిర్ణయించింది. ఈ రెండు ఫోన్లూ ప్రిజమ్‌ క్రష్‌ వైలెట్‌, ప్రిజమ్‌ క్రష్‌ బ్లాక్‌, ప్రిజమ్‌ క్రష్‌ వైట్‌ కలర్స్‌లో లభ్యం కానున్నట్లు కంపెనీ తెలిపింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం మాల్‌, శాంసంగ్‌ ఆన్‌లైన్‌ మార్కెట్స్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిధ రిటైల్‌ స్టోర్స్‌లో నేటి నుంచే ఈ ఫోన్‌ లభ్యం కానున్నట్లు కంపెనీ వెల్లడించింది.

A50s ఫీచర్స్‌..
ఆండ్రాయిడ్‌ 9 పై ఓఎస్‌తో శాంసంగ్‌ వన్‌ యూఐతో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. 6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఇన్ఫినిటీ ‘యూ’ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్‌లో ఎక్జినోస్‌ 9611 ప్రాసెసర్‌ను వినియోగించారు. ఇందులో వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరా ఉంది. 48+8+5 ఎంపీల కెమెరాలు ఇందులో అమర్చారు. ముందువైపు 32 ఎంపీల కెమెరా ఉంది. 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 15W ఫాస్ట్‌ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇందులో ఎన్‌ఎఫ్‌సీ, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఉన్నాయి.

A30s ఫీచర్స్‌
ఆండ్రాయిడ్‌ 9 పై ఓఎస్‌తో శాంసంగ్‌ వన్‌ యూఐపై ఈ ఫోన్‌ పనిచేస్తుంది. 6.4 హెచ్‌డీ+ ఇన్ఫినిటీ ‘వీ’ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ వస్తోంది. ఎగ్జినోస్‌ 7904 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో వెనుక వైపు 25+8+5 ఎంపీ కెమెరాలను అమర్చారు. ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 4000ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 15W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇందులో కూడా ఎన్‌ఎఫ్‌సీ, ఇన్‌బిల్ట్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఉంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.