Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009780
            [news_title_telugu_html] => 

మార్కెట్ల లాభాల జోరుకు బ్రేక్‌

[news_title_telugu] => మార్కెట్ల లాభాల జోరుకు బ్రేక్‌ [news_title_english] => Sensex falls 167 pts Nifty ends below 11000 [news_short_description] => ఐదు రోజులుగా లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ మార్కెట్ల పరుగుకు అడ్డుకట్ట పడింది. కీలక రంగాల షేర్లలో అమ్మకాలతో పాటు ప్రభుత్వం విడుదల చేసే గణాంకాలపై దృష్టిపెట్టిన మదుపర్లు అప్రమత్తత పాటించారు. అటు నేడు [news_tags_keywords] => Stock Market,BSE,NSE [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-13 00:23:55 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మార్కెట్ల లాభాల జోరుకు బ్రేక్‌ - Sensex falls 167 pts Nifty ends below 11000 - EENADU
close

తాజా వార్తలు

మార్కెట్ల లాభాల జోరుకు బ్రేక్‌

ముంబయి: ఐదు రోజులుగా లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ మార్కెట్ల పరుగుకు అడ్డుకట్ట పడింది. కీలక రంగాల షేర్లలో అమ్మకాలతో పాటు ప్రభుత్వం విడుదల చేసే గణాంకాలపై దృష్టిపెట్టిన మదుపర్లు అప్రమత్తత పాటించారు. అటు నేడు జరగబోయే యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ సమావేశం కూడా దేశీయ మార్కెట్ల గమనాన్ని ప్రభావితం చేసింది. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్న సూచీలు చివరకు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మళ్లీ 11వేల మార్క్‌ను కోల్పోయింది. 

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్‌, లోహ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగానే ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 150 పాయింట్లకు పైగా ఎగబాకింది. అయితే ఆ లాభాలు ఎంతోసేపు నిలువలేదు. మదుపర్ల అప్రమత్తతతో కొద్ది గంటలకే ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు మధ్యాహ్నానికి నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లే కన్పించినా చివరి గంటల్లో మళ్లీ ఊగిసలాట తప్పలేదు. మొత్తంగా నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 166 పాయింట్లు కోల్పోయి 37,104 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 10,981 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.34గా కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హిందాల్కో, సన్‌ఫార్మా షేర్లు లాభపడగా.. యస్‌ బ్యాంక్‌, టాటామోటార్స్‌, మారుతి సుజుకీ, యాక్సిస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టపోయాయి. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.