close

తాజా వార్తలు

ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆ ఫీచర్‌ వచ్చేసింది!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ సరికొత్త ఫీచర్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఖాతాదారులు ఇక నుంచి తమకు నచ్చిన పాటల్ని స్టోరీస్‌తో జోడించే విధంగా కొత్త ఆప్షన్‌ తీసుకువచ్చింది. గతేడాది మార్చిలోనే ఇన్‌స్టాగ్రామ్‌ ఈ సదుపాయాన్ని కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో అందుబాటులోకి తీసుకురాగా, ప్రస్తుతం భారత్‌లో కూడా తాజా అప్‌డేట్‌తో ఫీచర్‌ను పొందవచ్చు. స్టోరీస్‌ ఆప్షన్‌లోకి వెళ్లి స్టిక్కర్స్‌ బటన్‌ నొక్కితే ఈ ఫీచర్‌ కనిపిస్తుంది. అయినా మ్యూజిక్‌ ఆప్షన్‌ కనిపించకపోతే యాప్‌ను డిలీట్‌ చేసి మళ్లీ ఇన్‌స్టాల్‌ చేస్తే మీరు దాన్ని పొందవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ఈ మ్యూజిక్‌లో పాపులర్‌ సాంగ్స్‌, మోడ్స్‌, జెనర్స్‌ ఇలా మూడు రకాల సదుపాయాలు ఉంటాయి. వాటి ద్వారా మీకు నచ్చిన పాటల్ని బ్రౌజ్‌ చేసి స్టోరీస్‌కు జోడించుకోవచ్చు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.