close

తాజా వార్తలు

ఎయిర్‌టెల్‌ బ్యాంకింగ్‌ సరికొత్త సేవలు!

దిల్లీ: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు సరికొత్త సేవలతో మంగళవారం వినియోగదారుల ముందుకు వచ్చింది. నాణ్యమైన బ్యాంకింగ్‌ సేవలతో పాటు, నెలకు రూ.500 చెల్లింపుతో రూ.5లక్షల వ్యక్తిగత ప్రమాద బీమాను పొందేలా ‘భరోసా సేవింగ్స్‌ ఖాతా’ను వినియోగదారులకు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ సౌకర్యం ఆన్‌ బ్యాంక్‌, అండర్‌ బ్యాంక్‌ కస్టమర్లకు ప్రత్యేక అవసరాలను తీర్చడానికి రూపొందించినట్లు పేర్కొంది. ఖాతాదారులు ఏవైనా ప్రభుత్వ రాయితీలు పొందే సందర్భంలో నగదు తిరిగి పొందవచ్చు అని తెలిపింది. ఈ సందర్భంగా ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు ఎండీ అనుబ్రాతా బిస్వాస్‌ మాట్లాడుతూ.. ‘భరోసా సేవింగ్స్‌ ఖాతా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ పథకం ఆర్థికంగా వెనకబడిన వారి అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది. భారతీయ బ్యాంకింగ్‌ రంగంలో వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విస్తృత పరిశోధనల తర్వాత దీన్ని ప్రారంభించాం. మిలియన్ల మంది వినియోగదారులను అధికారిక బ్యాంకింగ్‌ సేవలకు పరిచయం చేయడమే లక్ష్యంగా దీనిని రూపొందించాం. ఈ ఖాతా వినియోగదార్లు భారతదేశంలో ఉన్న 6,50,000 ఏపీఎస్‌ అవుట్‌లెట్లలో నగదు తనిఖీలు, ఉపసంహరణలు చేసుకోవచ్చు’ అని తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.