close

తాజా వార్తలు

భారత్‌పై ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రశంసలు

పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని కితాబు

న్యూయార్క్‌: పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా భారత్‌ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కితాబిచ్చారు. అంతర్జాతీయంగా పర్యావరణ మార్పులపై జరుగుతున్న పోరాటంలో భారత్‌ కీలకపాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఐరాస కార్యలాయానికి 193 సౌర ఫలకలు బహూకరించారని.. ఇవి ఐరాసకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల సమకూర్చుకోవడంలో భాగంగా భారత్‌ సౌరవిద్యుత్‌పై భారీగా పెట్టుబడులు పెట్టడం శుభపరిణామనని తెలిపారు. క్లీన్ ఇండియా కోసం మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రభావవంతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ నెల 23న ఐరాసలో వాతావరణ మార్పులపై సదస్సు జరగనుంది. దీనిలో న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా అర్డెర్న్‌ సహా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. 

కర్బన ఉద్గారాల నుంచి విముక్తి కోసం కొన్ని దేశాలు అణు ఇంధనం దిశగా అడుగులు వేస్తున్నాయని గుటెరస్‌ అన్నారు. తమ అవసరాల కోసం మోదీ ప్రభుత్వం సైతం అణు ఇంధనంపై దృష్టి సారించిందని.. దీన్ని ఐరాస గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. 

మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఐరాస కార్యాలయంలో 193 సౌర ఫలకలతో కూడిన  ప్రత్యేక సోలార్‌ పార్క్‌ను ఏర్పాటు చేసింది. సర్వప్రతినిధుల సభ సమావేశాల సందర్భంగా మోదీ దీన్ని వివిధ దేశాధినేతల సమక్షంలో ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే కార్యక్రమంలో గాంధీ సిద్ధాంతాలు తమని ఏవిధంగా ప్రభావితం చేశాయో నేతలు వివరిస్తారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.