close

తాజా వార్తలు

ఆ బ్యాంకులు విఫలమయ్యాయి

ముంబయి: ఎస్‌బీఐ, పీఎన్‌బీలు తమ విధులను సక్రమంగా నిర్వహించడంలో విఫలమయ్యాయని సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ ఇటీవల దిల్లీ కోర్టుకు వెల్లడించింది. భూషణ్ స్టీల్‌కు రుణం ఇచ్చే సమయంలో ఈ రెండు బ్యాంకులు వాస్తవ పరిస్థితిని దాచిపెట్టాయని ఈ సంస్థ పేర్కొంది. ఫలితంగా మరింత అప్పు భూషణ్‌ స్టీల్స్‌కు లభించి .. చివరికి అది భారంగా మారిందని వెల్లడించింది. ఈ నివేదకను రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌తో పంచుకొంది. 
ఈ రెండు బ్యాంకులు డెలాయిట్‌ నిర్వహించిన ఆడిట్‌ రిపోర్టును ఆర్‌బీఐకి అందజేసే సమయంలో ఉద్దేశపూర్వకంగా దీనిని కప్పిపెట్టేలా భాషను వాడాయని పేర్కొంది. చివరికి బ్యాంకుల న్యాయ బృందాల సలహాలను కూడా పక్కనబెట్టేలా ఈ నివేదికలు ఉన్నాయని పేర్కొంది. దీనిపై ఎస్‌బీఐ, పీఎన్‌బీలు స్పందించలేదు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.