close

తాజా వార్తలు

గంట ఆలస్యంగా వచ్చిన ట్రంప్‌..ఎందుకంటే!

దిల్లీ: హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ-మోదీ కార్యక్రమం భారత్‌-అమెరికా మైత్రికి వేదికగా నిలిచింది. ఇరు దేశాధినేతలు చేసిన ప్రసంగాలు జనాల నీరాజనాలు అందుకున్నాయి. అయితే ట్రంప్‌ గంట ఆలస్యంగా రావడం చర్చనీయాంశంగా మారింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:20 గంటలకు మోదీ వేదిక వద్దకు చేరుకోగా..ట్రంప్‌ మాత్రం 10:25 గంటలకు వచ్చారు. అప్పటికే వేదికపై ఉన్న మోదీ.. స్వయంగా వెళ్లి ట్రంప్‌ని వేదికమీదకు తోడుకొని వెళ్లారు. షెడ్యూల్‌ ప్రకారం ట్రంప్‌ 9:39గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించాల్సి ఉంది. 

ఎందుకంటే...
టెక్సాస్‌ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు అనుకోకుండా ఎల్లింగ్టన్‌ వైమానిక స్థావరంలో కాసేపు ఆగారు. దీంతో కార్యక్రమానికి రావడం ఆలస్యమైంది.

కార్యక్రమంలో ట్రంప్‌ 25నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ పాలనపై ప్రశంసలు కురిపించారు. ఆయన సంస్కరణల ఫలితంగా 30కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులయ్యారన్నారు. భారత్‌-అమెరికా రక్షణ ఉత్పత్తుల భాగస్వాములుగా మారుతున్నాయని.. సరిహద్దు భద్రత ఇరు దేశాలకు ప్రాధాన్య అంశంగా మారిందన్నారు. ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి అమాయక పౌరులకు రక్షణ కల్పిస్తామన్నారు. భారత సంతతి అమెరికన్లు అమెరికా అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు.  


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.