
తాజా వార్తలు
తల్లి మృతి.. నలుగురు చిన్నారుల పరిస్థితి విషమం
డోన్: కుటుంబకలహాల కారణంగా ఓ తల్లి తన నలుగురు పిల్లలకు విషమిచ్చి తానూ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కర్నూలు పట్టణంలోని తారకరామ నగర్లో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన వడ్డె వరలక్ష్మి(36) అనే మహిళ సోమవారం ఉదయం భర్తతో గొడవపడింది. క్షణికావేశంలో నలుగురు చిన్నారులైన ఇందు(12), ఉమాదేవి(9), ఉదయ్‌కుమార్(5), ఐశ్వర్య(1)చేత విషం తాగించింది. అనంతరం తానూ తాగి ఆపస్మారక స్థితికి వెళ్లిపోయింది. గమనించిన స్థానికులు హుటాహుటిన డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మృతిచెందింది. నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ కంబగిరి రాముడు తెలిపారు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
- ఉసురు తీశాడు.. ఉరిపోసుకున్నాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
