close

తాజా వార్తలు

మోదీ.. మీరు రాక్‌స్టార్‌: సెలబ్రిటీల ట్వీట్లు

ముంబయి: ప్రధాని మోదీ నిజంగా రాక్‌స్టార్‌ అని బాలీవుడ్‌ సెలబ్రిటీలు అంటున్నారు. హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్జీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘హౌడీ మోదీ’లో మోదీ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేల మంది ప్రవాస భారతీయుల్లో మోదీ ప్రసంగం ఉత్సాహాన్ని నింపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం భారతీయ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామని అభయమిచ్చారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌ ప్రముఖులు అక్షయ్‌ కుమార్‌, సల్మాన్‌ ఖాన్‌, కరణ్‌ జోహార్‌, రిషి కపూర్‌, అభిషేక్‌ బచ్చన్‌ తదితరులు ట్వీట్లు చేశారు. మోదీ పట్ల గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు.

* ‘విడివిడిగా మనమంతా నీటి బిందువు లాంటివాళ్లం. కానీ మనమంతా కలిస్తే ఓ సముద్రం. ‘హౌదీ మోదీ’ కార్యక్రమం కోసం జనసంద్రం కదిలి వచ్చింది. ‘అంతా బాగుంది’.. అని ప్రధాని మోదీ వివిధ భారత దేశ ప్రాంతీయ భాషల్లో చెప్పడం ఎంతో బాగుంది. ఆయన నిజంగా 1.3 బిలియన్‌ భారతీయుల ప్రతినిధి’- అక్షయ్‌ కుమార్

* ‘ఇక ఇరు దేశాల మధ్య స్నేహబంధం మరింత బలపడనుంది’ అంటూ ‘హౌదీ మోదీ’ వేదికపై ప్రసంగిస్తుండగా ట్రంప్‌ చప్పట్లు కొడుతున్న ఫొటోను సల్మాన్‌ షేర్‌ చేశారు.

* ‘ప్రపంచ వేదికపై మన దేశ ప్రధాని ప్రసంగించిన తీరు అద్భుతం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు గర్వించాల్సిన సమయం ఇది. మోదీ వ్యాఖ్యలు నిజంగా స్ఫూర్తిదాయకం. భారత ప్రధానికి జనాల నుంచి వచ్చిన స్పందన చూసి ట్రంప్‌ కూడా ఆశ్చర్యపోయారు’- కరణ్‌ జోహార్‌

* ‘‘హౌడీ మోదీ’.. ‘గో మోదీ’.. ‘గో ట్రంప్‌’.. నేను భారతీయుడిని కావడం గర్వంగా ఉంది’- రిషి కపూర్

* ‘నిజంగా ఇది అద్భుతం’-అభిషేక్‌ బచ్చన్‌



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.