
తాజా వార్తలు
ముజఫర్‌నగర్: ఆదివారం దేశం మొత్తం కుమార్తెల దినోత్సవం జరుపుకొంటే ఒక తల్లి తనకు పుట్టిన ఇద్దరు కవల పిల్లలను ఎలా పెంచాలో తెలియక చెరువులో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసు అధికారి అభిషేక్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్ ముజఫర్‌నగర్‌కు చెందిన వసీమ్, నజ్మాలకు 20 రోజుల కిందట కవల పిల్లలు పుట్టారు. వసీమ్‌కు సరైన ఉద్యోగం లేకపోవడం వల్ల ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలోనే ఆదివారం కూడా భార్యభర్తలిద్దరూ గొడవపడ్డారు. ఆవేశంలో నజ్మా ఆ పసికందులను చెరువులో పడేసింది. అనంతరం భార్యభర్తలిద్దరూ గ్రామస్థులకు తమ పిల్లలను ఎవరో కిడ్నాప్ చేశారని నమ్మించారు. పోలీసు స్టేషన్లో కిడ్నాప్ విషయంపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిని ప్రశ్నించడానికి ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ స్టేషన్‌కి పిలిపించారు. ఈ క్రమంలో వారు చెబుతున్న జవాబులు ఒకదానికొకటి పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా నిలదీయడంతో పిల్లలను చెరువులో పడేసి హత్య చేసినట్లు ఒప్పుకొన్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఉతికి ఆరేశారు
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- దిశకు తల్లిదండ్రులతో సఖ్యత లేదేమో!
- గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
- అసలు కాల్పులు అక్కడే జరిగాయా?
- పథకం ప్రకారమే బూటకపు ఎన్కౌంటర్
- వాంఖడేలో రికార్డుల మోత!
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఎన్‌కౌంటర్‌పై సుప్రీం విచారణ కమిషన్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
