close

తాజా వార్తలు

ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు

ఈటీవీ ‘ఫోన్‌ఇన్‌’లో ఈవో సురేశ్‌బాబు

విజయవాడ: ఈనెల 29 నుంచి అక్టోబర్‌ 8 వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా ఉత్సవాలకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది అనుభవాలను దృష్టిలోపెట్టుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపడుతున్నట్లు ఈవో సురేశ్‌బాబు వెల్లడించారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఈటీవీ నిర్వహించిన ‘ఫోన్‌ ఇన్‌’లో ఆయన మాట్లాడారు. 

‘29 నుంచి 10రోజుల పాటు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం’ అని చెప్పారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చని ఈవో తెలిపారు.

దర్శనానికి వచ్చే భక్తులు కెనాల్‌ రోడ్డులోని వినాయక గుడి నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తారని ఈవో చెప్పారు. ‘దుర్గగుడి టోల్‌గేట్‌ నుంచి దర్శనం క్యూలైన్‌లోకి ప్రవేశం ఉంటుంది. కుమ్మరిపాలెం వైపు నుంచి మరో లైన్‌ను ఏర్పాటు చేశాం. ఓంకారం మలుపు నుంచి 2 ఉచిత దర్శనం క్యూలైన్లు ఉంటాయి. అంతేకాకుండా రూ.100, రూ.300, వీఐపీ క్యూలైన్ల ద్వారా కూడా అమ్మవారిని దర్శించుకోవచ్చు’ అని తెలిపారు. భక్తుల కోసం దేవస్థానం తరఫున రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ ప్రాంగణాల్లో 9 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. దర్శనానికి వెళ్లే భక్తులు వారి దగ్గర ఉన్న సెల్‌ఫోన్లు, బ్యాగ్‌లు, పాదరక్షలు రథం సెంటర్లో భద్రపరిచే సౌకర్యం కల్పించామని వివరించారు. దర్శనం తర్వాత అర్జున వీధి నుంచి రథం సెంటర్‌ వద్ద తమ వస్తువులు తీసుకోవచ్చన్నారు. భక్తులకు కనకదుర్గా నగర్‌లో 12 కౌంటర్ల ద్వారా స్వామి వారి ప్రసాదం పంపిణీ, తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 వరకూ లడ్డూ, పులిహోర విక్రయిస్తామని ఈవో తెలిపారు. 

పద్మావతి, కృష్ణవేణి, దుర్గా ఘాట్ల వద్ద భక్తుల కోసం జల్లు స్నానాలు, 300 మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు ఈవో సురేశ్‌బాబు తెలిపారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంటే దుర్గ ఘాట్‌లో జల్లు స్నానాలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. క్యూలైన్‌ మార్గంలో 20 మొబైల్‌ టాయిలెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజూ 25వేల మంది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈవో చెప్పారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.