close

తాజా వార్తలు

సీఎం ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తా!

ఏపీఎస్‌ఆర్టీసీ నూతన ఎండీ కృష్ణబాబు

అమరావతి: దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రప్రదేశ్‌ రహదారి రవాణా సంస్థను మరింత అత్యాధునికంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా అందరి సహకారంతో ముందుకు వెళ్తామని సంస్థ ఇన్‌ఛార్జి వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.టి. కృష్ణబాబు తెలిపారు. విజయవాడ ఆర్టీసీ బస్సు భవన్‌లో ఆయన అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, కార్మిక సంఘాల నాయకులు కృష్ణబాబుకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన కమిటీ సభ్యులతో కృష్ణబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆర్టీసీ బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ రవాణా శాఖలో రాష్ట్ర రహదారి రవాణా సంస్థ విలీన ప్రక్రియ కొనసాగుతోందని జనవరి 1 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2015 నుంచి ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం వేయకుండా డీజిల్‌ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతుండడం, ఆర్టీసీ సిబ్బంది వేతన సవరణ చేపట్టడం వల్ల సంస్థకు నెలకు రూ.100 కోట్ల రూపాయల నష్టం వస్తోందని చెప్పారు. లీటరుకు రూపాయి డీజిల్‌ ధర పెరిగితే ఏడాదికి 30 కోట్ల రూపాయల అదనపు భారం సంస్థపై పడుతోందన్నారు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే ముఖ్యమంత్రి ఆర్టీసీని ప్రభుత్వ శాఖలోకి విలీనం చేయాలని నిర్ణయించారన్నారు.

కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారి జీతం కోసం రూ. 3300 కోట్ల భరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని కృష్ణబాబు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అందుతాయని, జనవరి నుంచి అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రస్తుత డీజిల్‌ బస్సులను దశల వారీగా ఎలక్ట్రికల్‌ బస్సులుగా మార్చేందుకు ప్రయత్నాలు చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వ రాయితీతో తొలి విడతగా 350 విద్యుత్‌ బస్సులను నడిపేందుకు వీలుగా టెండర్లు ఆహ్వానించామన్నారు. మరో విడతగా.. 650 బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వీటి పనితీరును పరిగణనలోకి తీసుకొని, దశల వారీగా ఎలక్ట్రికల్‌ బస్సుల సంఖ్య పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఎలక్ట్రికల్‌ బస్సుల నిర్వహణలో కండక్టరు మాత్రమే సంస్థ నుంచి ఉంటారని, మిగతావారంతా టెండరు పొందిన వారే చూసుకోవాల్సి ఉంటుదని చెప్పారు. ఎలక్ట్రికల్‌ బస్సుల టెండర్లు, ఇతర అంశాలను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కృష్ణబాబు స్పష్టం చేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.