close

తాజా వార్తలు

అప్‌డేటెడ్‌ ఎక్స్‌యూవీ 300

సందర్భం

 

మహీంద్రా తన ఎక్స్‌యూవీ 300 లైనప్‌కి మరో కొత్త మోడల్‌ జోడించింది. ఎక్స్‌యూవీ 300 డబ్ల్యూ 6 ఆటోమేటిక్‌ రకాన్ని తీసుకొచ్చింది. డీజిల్‌ వేరియంట్‌లో వచ్చిన ఈ ఎస్‌యూవీ ధర రూ.9.99లక్షలు. 1.5లీటర్ల, 4సిలిండర్‌ టర్బోఛార్జ్‌డ్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఇది. 300ఎన్‌ఎం టార్క్‌ మీద 117బీహెచ్‌పీని విడుదల చేస్తుంది.
 


కొత్త రంగుల్లో స్కూటీ పెప్‌

టీవీఎస్‌ స్కూటీ పెప్‌ మార్కెట్లోకి వచ్చి పాతికేళ్లు పూర్తైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కోరల్‌ మ్యాటే, ఆక్వా మ్యాటే అనే రెండు కొత్త రంగుల్లో స్కూటీని విడుదల చేశారు. వీటితోపాటు పెప్‌ప్లస్‌ని బాడీ గ్రాఫిక్స్‌, త్రీడీ ఎంబ్లెమ్‌, టెక్చర్డ్‌ సీటుతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 87.8సీసీ, సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌కూల్డ్‌ ఇంజిన్‌తో నడిచే ఈ ద్విచక్రవాహనం ధర రూ.44,764 (ఎక్స్‌ షోరూం).


ఎలాంత్రా బుకింగ్‌లు


హ్యుందాయ్‌ కంపెనీ ఎలాంత్రా 2019 ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ అక్టోబరు 3 నుంచి అమ్మకానికి అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి బుకింగ్‌లు మొదలయ్యాయి. క్యాస్కేడింగ్‌ గ్రిల్‌, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, త్రిభుజాకారపు ఫాగ్‌ల్యాంప్‌లు, మస్క్యులర్‌ బానెట్‌, అలాయ్‌ చక్రాలు, కొత్త బంపర్‌, మెలికలు తిరిగిన టెయిల్‌ లైట్లు.. కొత్త ఎలాంత్రాలో ఇలాంటి మార్పులెన్నో చేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.