
తాజా వార్తలు
వాటాల విక్రయానికి రంగం సిద్ధం
న్యూదిల్లీ: మార్కెట్ దూకుడు మీదుంది.. ఇప్పుడు ఐపీవోకు వచ్చే కంపెనీలకు భారీ మార్కెట్ విలువ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కూడా పలు కంపెనీల్లో పెట్టుబడులను ఉపసంహరించేందుకు ఇంతకంటే మంచి సమయం లేదని భావిస్తోంది.
పది రోజుల క్రితం వరకు విదేశీ పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్ల నుంచి వైదొలగుతుండటంతో సూచీలు నేలచూపులు చూశాయి. కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ పన్ను తగ్గింపుతో పాటు ఇతర రాయితీలను కూడా ప్రకటించడంతో ఒక్కసారిగా మార్కెట్లు యూటర్న్ తీసుకున్నాయి. రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ దాదాపు 3వేల పాయింట్ల పైకి దూసుకెళ్లింది. అప్పటి వరకు భారీగా మార్కెట్ విలువ కోల్పోయిన కంపెనీలు కూడా పుంజుకొన్నాయి. దీంతో ఐపీవోపై ఆశలు వదులుకున్న కంపెనీలు కూడా తిరిగి మార్కెట్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ఐఆర్సీటీసీని ప్రభుత్వం ఐపీవోకు తీసుకొచ్చింది.
కార్పొరేట్ పన్ను తగ్గడంతో చాలా కంపెనీల లాభాలు మెరుగయ్యే అవకాశాలతో పాటు నగదు నిల్వలు పెరుగుతాయి. మెరుగైన లాభాల, నగదు నిల్వలు చూపించే కంపెనీలకు ఐపీవోలో భారీ డిమాండ్ ఉంటుంది. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో రూ.1.05లక్షల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. ముఖ్యంగా ప్రభుత్వానికి భారంగా మారిన ఎయిరిండియా విక్రయం పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ కంపెనీపై ఇప్పటికే రూ.30వేల కోట్ల రుణభారం ఉంది. ఇప్పటికే ఎయిరిండియా విక్రయం విఫలమైన విషయం తెలిసిందే. కానీ, మార్కెట్లు సానుకూలంగా ఉండటం, కార్పొరేట్ పన్నులు తగ్గడంతో ఇప్పుడు ఈ కంపెనీ కొనుగోలుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఎయిర్ ఇండియాకు సంబంధించిన పేపర్ వర్క్ మొదలైపోయింది. త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనికి హోంశాఖ మంత్రి నేతృత్వంలో ప్రత్యేక బృందం అనుమతి ఇవ్వాల్సి ఉంది.
పెట్టుబడుల ఉపసంహరణ పనులు మొదలు..
పలు కంపెనీల్లో వాటాల విక్రయంపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రభుత్వ కార్యదర్శుల బృందం సోమవారం కొన్ని కంపెనీల్లో వాటాల వ్యూహాత్మక విక్రయానికి క్లియరెన్స్ ఇచ్చింది. ఈ కంపెనీల్లో భారత్ పెట్రోలియం, బీఈఎంఎల్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలు ఉన్నాయి. వీటితోపాటు టీహెచ్‌డీసీ ఇండియా, నీప్‌కోలో పూర్తి వాటాలకు కూడా గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఈ పవర్ కంపెనీలను ఎన్టీపీసీ విలీనం చేసుకోనుంది.
సోమవారం ఈ షేరు విలువ మార్కెట్లో రూ.470గా ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం బీపీసీఎల్‌లో ప్రభుత్వానికి ఉన్న వాటాల విలువ రూ.55వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రభుత్వం మాత్రం రూ.65వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనావేస్తోంది. ప్రభుత్వ వాటా 53.3శాతం ఉండటంతో ఈ వాటాల విక్రయానికి పార్లమెంట్ అనుమతి అవసరంలేదు.
ఇక బీఈఎంల్లో ప్రభుత్వానికి 54 శాతం వాటా ఉంది. దీని విలువ రూ.2,100 కోట్ల వరకు ఉండొచ్చు. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వానికి ఉన్న 54.8 వాటా విలువ రూ.20వేల కోట్ల వరకు ఉండొచ్చు. ఇక షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోని 73.75శాతం వాటా విలువ రూ.1,300 కోట్లు ఉంటుంది.
మార్కెట్లో బుల్ హవా ఉన్న సమయంలో ఈ షేర్లను విక్రయించి భారీగా నిధులను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతా ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం సాగితే దీపావళి నాటికి మార్కెట్లో ప్రభుత్వ రంగ కంపెనీలు వాటాల విక్రయంతో సందడి చేయడం ఖాయం.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఉతికి ఆరేశారు
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- టీమిండియా సమష్టి విజయం
- అసలు కాల్పులు అక్కడే జరిగాయా?
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- దిశకు తల్లిదండ్రులతో సఖ్యత లేదేమో!
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
