close

తాజా వార్తలు

భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య కొత్త ఒప్పందాలు

3 కొత్త ప్రాజెక్టులు ఆవిష్కరించిన మోదీ, హసీనా

దిల్లీ: భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో ప్రధాని మోదీ శనివారం దిల్లీలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు రక్షణ, వాణిజ్యం వంటి విషయాల్లో కొన్ని ఒప్పందాలపై ఇరువురు నేతలు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మోదీ, హసీనా కలిసి 3 కొత్త ప్రాజెక్టులను ఆవిష్కరించారు. ఈశాన్య రాష్ట్రాలకు బంగ్లాదేశ్‌ నుంచి ఎల్‌పీజీ పంపిణీ చేసేందుకు నిర్మించిన పైపులైన్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. 
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘గత ఏడాదిలో 12 ప్రాజెక్టులు బంగ్లాదేశ్‌తో కలిసి ప్రారంభించాం. రెండు దేశాల్లో ప్రజలు ఉన్నతంగా జీవించడం లక్ష్యంగానే ఈ ప్రాజెక్టులకు నాంది పలికాం. భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఉన్న స్నేహ భావానికి ఇదే నిదర్శనం. రెండు దేశాల ప్రయోజనాలు ఎల్‌పీజీ పైపులైన్‌ ప్రాజెక్టు వల్ల నెరవేరతాయి. దీనివల్ల భారత ప్రజలు గ్యాస్‌ వినియోగించుకోవడమే కాకుండా, బంగ్లాదేశ్‌లోనూ ఉద్యోగ కల్పన ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఏడాది పొడవునా లబ్ధి పొందవచ్చు.’’ అని మోదీ అన్నారు. రవాణా, అనుసంధానం, రక్షణ సహా కీలకమైన ఏడు పత్రాలపై మోదీ, హసీనా సంతకాలు చేశారు. గురువారం దిల్లీ చేరుకున్న హసీనా నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.