close

తాజా వార్తలు

వాళ్లకి దసరా ఆనందం లేదు: చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించి లక్షలాది పేద కుటుంబాల పొట్టకొట్టారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పండగ పూట పేద కుటుంబాలు పస్తులుండే దుస్థితి తెచ్చారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. నిర్మాణ కార్మికులను అప్పులపాల్జేసి వారికి దసరా ఆనందం లేకుండా చేశారని దుయ్యబట్టారు. ఇసుక కష్టాలు.. పేదల పొట్ట కొట్టి వైకాపా నేతలు జేబులు నింపే ఆకృత్యాలు ఇంకెన్నాళ్లని చంద్రబాబు ప్రశ్నించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.