close

తాజా వార్తలు

మరో 100 నగరాల్లో స్విగ్గీ

న్యూదిల్లీ: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ అందించే ప్రముఖ సంస్థ స్విగ్గీ తన సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి 600 నగరాలు, 200 యూనివర్సిటీల్లో సేవలు అందిస్తామని తెలిపింది. ప్రస్తుతం 500 నగరాలు, 75 యూనివర్సిటీల్లో ఈ సంస్థ ఫుడ్‌ డెలివరీ సేవలను అందిస్తోంది. లాంచ్‌ప్యాడ్‌ ప్రొగ్రామ్‌ కింద యూనివర్సిటీల్లో విద్యార్థులను స్విగ్గీ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయనుంది. వారి సహకారంతో 200 యూనివర్సిటీల్లో  ఈ ఏడాది చివరి నాటికి సేవలు అందించాలని యోచిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అదే క్రమంలో మరో 100 నగరాల్లో సేవలను విస్తరించాలని నిర్ణయించింది. 500 నగరాలు, 75 వర్సిటీల్లో వస్తున్న ఆదరణ దృష్ట్యా 600 నగరాలు, 200 వర్సిటీలకు సేవలను ఈ ఏడాది చివరి నాటికి విస్తరించాలని నిర్ణయించామని కంపెనీ సీవోవో వివేక్‌ సుందర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం 500 నగరాల్లో 1.40 లక్షల రెస్టారెంట్లతో స్విగ్గీ భాగస్వామ్యం కలిగి ఉంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.