close

తాజా వార్తలు

రెడ్‌మీ నోట్‌ 7 ప్రో ధర తగ్గింపు

ఇంటర్నెట్‌డెస్క్‌: పండగ సందర్భంగా కొనుగోలుదారులను ఆకట్టుకోవడం కోసం ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ షావోమి అత్యుత్తమ ఆఫర్‌ను ప్రకటించింది. తమ ఫోన్లలో అత్యంత అధికంగా అమ్ముడుపోయే రెడ్‌మీ నోట్‌ 7 ప్రో ధరను శాశ్వతంగా రూ.2000 తగ్గించింది. తాజా ధరలతో ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌ వెబ్‌సైట్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. రూ.13,999గా ఉన్న 4జీబీ/64జీబీ వేరియంట్‌ ధర తగ్గింపు అనంతరం రూ.11,999కు లభ్యం కానుంది. రూ.15,999గా ఉన్న 6జీబీ/64జీబీ వేరియంట్‌ ఇకపై రూ.13,999 కే లభించనుంది. ఇక 6జీబీ/128జీబీ వేరియంట్‌ ధర సైతం తగ్గింపు అనంతరం రూ.14,999కే లభిస్తోంది.

6.3 అంగుళాల పుల్‌ హెచ్‌డీ+ డాట్ నాచ్‌ డిస్‌ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 9 పై ఓఎస్‌తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 675 ప్రాసెసర్‌ను వినియోగించారు. వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉన్నాయి. సోనీ ఐఎమ్‌ఎక్స్‌ సెన్సర్‌తో 48 మెగాపిక్సెల్‌ కెమెరాతోపాటు 5 మెగాపిక్సెల్‌ సెకండరీ కెమెరా ఉపయోగించారు. ముందు భాగంలో 13 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఉంది. 3.5ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, టైప్‌ - సి పోర్ట్‌ను వినియోగించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.