close

తాజా వార్తలు

జీఎస్టీ వసూళ్లు పెంపునకు కమిటీ

దిల్లీ: జీఎస్టీ వసూళ్లు తగ్గిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. జీఎస్టీ వసూళ్లు పెంపు, చట్టంలోని మార్పులను సూచించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 15 రోజుల్లోగా తొలి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. జీఎస్టీ వసూళ్లు 19 నెలల కనిష్ఠానికి చేరిన నేపథ్యంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం.

2017లో జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చిన కొన్నాళ్లకే వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో వసూళ్లు కేవలం రూ.91,916 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 2.67 శాతం తక్కువ. 2018 ఫిబ్రవరితో తర్వాత జీఎస్టీ వసూళ్లు ఇంత కనిష్ఠ స్థాయిలో వసూలు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. విస్తృత సంస్కరణలతో ముందుకు రావాలని జీఎస్టీ కౌన్సిల్‌ సెక్రటేరియట్‌ కమిటీకి సూచించింది. మొత్తం 6 పాయింట్లతో ఎజెండాను నిర్దేశించింది. జీఎస్టీలో చేయాల్సిన మార్పులకు సంబంధించి సిఫార్సులతో రావాలని ఆదేశించింది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.