
తాజా వార్తలు
ప్రస్తుతం అంకుర సంస్థల హవా నడుస్తోంది. వీటిని మొదలుపెడుతున్నవారిలో అమ్మాయిలూ తక్కువేం కాదు. వాటిల్లో నిలదొక్కుకుని లాభాల బాట పట్టాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
* వ్యాపారం ప్రారంభిస్తున్నప్పుడు సవాళ్లే ఎక్కువగా ఉంటాయి వాటిని వీలైనంతవరకూ సానుకూలంగా తీసుకుని, పరిష్కరించుకునేలా చూసుకోవాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.
* ఉద్యోగం చేయడంతో పోలిస్తే... సొంతంగా వ్యాపారం చేస్తున్నప్పుడు ఒత్తిడి సహజంగానే ఎదురవుతుంది. దాన్నుంచి బయటపడాలంటే... ఎంత సమయం లేకపోయినా మీకంటూ ఓ అరగంట పెట్టుకోండి. ఆ సమయంలో నడక, ధ్యానం వంటివి ఎంచుకోండి.
* ఒకేసారి చాలా పనులు చేయాలని అసలు అనుకోకూడదు. ఒకపని తరువాతే మరొకటి అనే నియమం పెట్టుకోవాలి. ప్రతిదానికి ఓ ప్రణాళిక రూపొందించుకోవాలి. అన్ని పనులు మీరే చేయాలని చూడకుండా మీ ప్రమేయం లేనివాటిని ఇతరులకు అప్పగించండి. పనిభారం తగ్గుతుంది.
* మీరెంచుకున్న రంగంలో రాణించాలంటే కుటుంబసభ్యుల సహకారం చాలా అవసరం. వాళ్లతో మీ ఆలోచనల్ని వివరించి, సాయం అడగండి. తప్పకుండా అర్థంచేసుకుంటారు.
* మీకంటూ ఓ మెంటార్ని పెట్టుకోండి. ఆ సలహాలు, అనుభవాలు మీకెంతో ఉపయోగపడతాయి. మీ నెట్వర్క్ పరిధినీ విస్తరించుకుంటే.. మీ రంగంలో వస్తోన్న మార్పులు, కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు.
* చదువు పూర్తయినా నిత్య విద్యార్థిలా ఉండాలి. తెలియని విషయాలు నేర్చుకోవడం, అవసరమైన మెలకువలు, నైపుణ్యాలు పెంచుకోవడం చాలా అవసరం. అది మీకు ఎంతో ఉపయోగపడుతుంది.
* వ్యాపారం చేస్తున్నప్పుడు కేవలం పర్యవేక్షణ మాత్రమే కాకుండా... అన్ని పనులు తెలిసుండాలి. ఇది మీకు ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- ‘రూలర్’ కొత్త ట్రైలర్ చూశారా
- జపాన్లో రానా బర్త్డే సెలబ్రేషన్స్
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
- మృతదేహంతో నడిరోడ్డుపై నరకయాతన
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- అలా అయితే విసుగొచ్చేస్తుందట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
