
తాజా వార్తలు
యువతి రాసిన లేఖ
రంగోయి(కాశీబుగ్గ), న్యూస్‌టుడే: ‘ఇంటర్మీడియట్ నుంచి ప్రేమించుకుంటున్నాం..కలిసి బతకాలనుకున్నాం..కాని ఇప్పుడు నేను తనకి నచ్చట్లేదు. ప్రేమించిన వ్యక్తి నరకం చూపిస్తాడనుకోలేదు. నేను చనిపోతే ఎవరికీ ఎటువంటి సమస్య ఉందదు. అందరూ సంతోషంగా ఉంటారు’ అని లేఖ రాసి ఓ యువతి(25) బలవన్మరణం చెందింది. కాశీబుగ్గ సీఐ ఆర్.వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం...పలాస మండలానికి చెందిన ఓ యువతి గ్రామ సమీపంలోని బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడింది. మందస మండలానికి చెందిన తులసీదాస్, యువతి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తులసీదాస్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా బిహార్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. వివాహం చేసుకుంటానని చెప్పి తులసీదాస్ మోసం చేయడంతో మనస్తాపానికి గురై ఈ నెల 12వ తేదీ సాయంత్రం బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెప్పారు. ఆదివారం సాయంత్రం మృతదేహం బావిలో తేలడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- 8 మంది.. 8 గంటలు
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- సినిమా పేరు మార్చాం
- మరోసారి నో చెప్పిన సమంత
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
