
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ 2020లో భారత్ మార్కెట్లోకి మరో రెండు కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన కియా సెల్టోస్‌కు మంచి ఆదరణ లభించడంతో సన్నాహాలను వేగవంతం చేసింది. సెల్టోస్ తర్వాత ప్రీమియం ఎంపీవీ కార్నివాల్‌ను మార్కెట్‌కు పరిచయం చేయాలని భావిస్తోంది. ఈ కారు టయోటా ఇన్నోవా క్రిస్టాకు బలమైన పోటీని ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కారును అనంతపురం ప్లాంట్‌లో తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆటోఎక్స్పోలో దీనిని ప్రదర్శించే అవకాశం ఉంది.
కార్నివాల్‌తో పాటు మరో సబ్‌కాంపాక్ట్ ఎస్యూవీ కారును కూడా మార్కెట్లోకి తీసుకురావాలని కియా భావిస్తోంది. ఈ కారును మొదటి నుంచి భారత్‌లోనే అభివృద్ధి చేసి ఎగుమతి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కారును ప్రస్తుతం క్యూవైఐ అనే సాంకేతిక పేరుతో పిలుస్తున్నారు. ఈ కారు ఇప్పటికే మార్కెట్ లీడర్లుగా ఉన్న హ్యూందాయ్ వెన్యూ, విటార బ్రెజా, మహీంద్రా ఎక్స్యూవీలను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్నారు. ఈ కారు వివరాలు కూడా 2020 ఆటోఎక్స్పోలో వెల్లడి చేసే అవకాశం ఉంది.
కియా మూడోతరం కార్నివాల్ మోడల్‌ను 2015లో తొలిసారి ప్రపంచ మార్కెట్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ కారును అమెరికాలో కియా సెడోనా పేరుతో విక్రయిస్తున్నారు. 2019లో ఈ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకొచ్చారు. భారత్‌లో విక్రయించాలనుకుంటున్న కారులో 7-8 సీట్లు ఉండవచ్చు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
