close

తాజా వార్తలు

ఇలా చేస్తే విమాన టికెట్లు చౌకగా..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: విమాన టికెట్ల ధరలు చాలా వేగంగా మారిపోతుంటాయి. ఒకే ప్రయాణానికి సంబంధించిన టికెట్ల కోసం పలుమార్లు నెట్‌లో సెర్చ్‌ చేస్తే చాలా వేగంగా పెరిగిపోతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే విమానయాన టికెట్లను కొంత చౌకగా పొందే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లేవారు విమానయాన టికెట్లను ముందుగానే బుక్‌ చేసుకోకపోతే భారీగా అధిక మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే టికెట్లను బుక్‌చేసుకొనేందుకు కొన్ని చిట్కాలు..  

రహస్యంగా ఉంచండి..

మనం ఉపయోగించే ఇంటర్నెట్‌ బ్రౌజరులో సాధారణంగా కుకీలు ఉంటాయి. ఇవి మన నెట్‌లో ఏమి వెతుకుతున్నామో ట్రాక్‌ చేస్తాయి. ఒకే మార్గంలో ప్రయాణం కోసం అదేపనిగా నెట్‌లో సెర్చ్‌ చేస్తుంటే మనం భయపడి అప్పటికప్పుడే టికెట్లు బుక్‌ చేసుకునేలా ధరలను పెంచుతుంటాయి. దీనికో పరిష్కార మార్గం ఉంది. మనం వెతికే బ్రౌజరులో ‘ప్రైవేటు మోడ్‌’ ఉంటుంది. కీబోర్డుపై షిఫ్ట్‌+కంట్రోల్‌+ఎన్‌ అనే కీ నొక్కితే ఇది ఓపెన్‌ అవుతుంది. సాధారణ బ్రౌజర్‌కు భిన్నంగా నలుపు రంగులో కనిపిస్తుంది.  దీనిలో మనం సెర్చ్‌ చేస్తే కుకీలు యాక్సెస్‌ చేయలేవు. కాబట్టి ఆ  సమాచారాన్ని ఆయా వెబ్‌సైట్లకు వెళ్లనివ్వవు. దీంతోపాటు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌లో చెల్లింపు దశలో ధర పెరిగే అవకాశాలను తగ్గిస్తుంది. 

ధరలను పోల్చుకోండి..

ఏదో ఒక వెబ్‌సైట్‌లో ధరలను చూసి గుడ్డిగా టికెట్లు కొనుగోలు చేయవద్దు. సాధారణంగా కంపెనీలు చేసే భారీ ప్రచారాలను చూసి ఆ వెబ్‌సైట్లను ఆశ్రయిస్తుంటారు. ఎంత అర్జెంట్‌ ఉన్నా రెండు మూడు వెబ్‌సైట్లలో ధరలను పరిశీలించి పోల్చుకోండి. ధరలను పోల్చే వెబ్‌సైట్లు కూడా వాటిల్లో చూసుకోవచ్చు. IRCTC వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసుకోవడం మరో విధానం. ఈ వెబ్‌సైట్‌లో రూ.59 మాత్రమే కన్వీనియన్స్‌ ఫీజుగా తీసుకొంటారు. చాలా వెబ్‌సైట్లలో రూ.200-రూ.400 వరకు ఉంటున్నాయి. ఇది కూడా ఇన్‌కాగ్నిటో (ప్రైవేటు) బ్రౌజర్‌లోనే చేయాలి. 

‘రౌండ్‌ట్రిప్‌’ అన్నివేళలా లాభం కాదు..

సాధారణంగా రౌండ్‌ ట్రిప్‌లో టికెట్లు బుక్‌ చేసుకొంటే లాభపడవచ్చని చాలా మంది అనుకొంటారు. దీనిలో అన్ని వేళలా రిటర్న్‌ టికెట్లు తక్కువ ధరకు లభించవు. వన్‌వే, రౌండ్‌ ట్రిప్‌ ధరలను పోల్చుకోవాలి. వన్‌వే ప్రయాణాలకు బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌ టికెట్ల ధరలు తక్కువగా ఉంటాయి. దీనికి కొంత ఓపిక అవసరం.  అదే సమయంలో ఒకటి కంటే ఎక్కువ స్టాప్‌లు ఉన్న విమానాన్ని బుక్‌ చేసుకొంటే ధర కొంత తగ్గే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇటువంటి అవకాశం ఉంటుంది. 

తేదీ, సమయం ఎంపికలో అప్రమత్తత..

అత్యవసరం కాకపోతే ప్రయాణ తేదీలను మార్చుకొనేందుకు సిద్ధంగా ఉండాలి. సాధారణంగా వారాంతాల్లో , పండుగల సమయాల్లో ధరలు ఎక్కువగా ఉంటాయి. చాలా సంస్థలు కూడా సాధారణ రోజుల్లో ధరలను తక్కువగానే ఉంచుతాయి. వీలైనంత ఎక్కవ రోజులు ముందుగానే టికెట్లను బుక్‌ చేసుకొంటే తక్కువ ధరకు వస్తాయి. చివరి మూడు వారాల్లో కంపెనీలు సాధారణంగా ధరలను పెంచేస్తాయి. ప్రయాణ తేదీలను మార్చుకునే అవకాశం ఉంటే టికెట్‌ ధరలు తక్కవ ఉన్న డేట్లను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల లోపు ప్రయాణాలు ప్రారంభించే విమానాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ వేళల్లో విమానాల టికెట్‌ ధరలు ఎక్కువగా ఉంటాయి. 

రివార్డు పాయింట్లను వాడుకోవాలి..

మీకు ఏదైనా కొనగోలు చేసినప్పుడు విమాన టికెట్లపై రివార్డు పాయింట్లు వస్తే వాడుకోవాలి. తరచూ విమన ప్రయాణాలు చేసేవారు ట్రావెల్‌ క్రెడిట్‌ కార్డులు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కార్డుల్లో వచ్చే రివార్డు పాయింట్లు ప్రయాణా టికెట్ల బుకింగ్స్‌లో డిస్కౌంట్లకు ఉపయోగపడతాయి. విమానయాన సంస్థలు ఏర్పాటు చేసే రివార్డు పాయింట్ల ప్రోగ్రామ్‌లో చేరవచ్చు. చాలా విమానయాన సంస్థలు బుకింగ్‌ సమయంలో చెక్‌ ఔట్‌ పేజీలో డిస్కౌంట్‌ కూపన్లను ఆఫర్‌ చేస్తాయి. కానీ, చాలా వెబ్‌సైట్లు వీటిని హైలైట్‌ చేయవు. జాగ్రత్తగా గమనించి ఉపయోగించుకోవాలి. టికెట్లను విక్రయించే యాప్స్‌ కూడా డిస్కౌంట్‌ కూపన్లను ఇస్తుంటాయి. వీటికి మర్చిపోకుండా వాడుకొంటే వీలైనంత చౌకగా విమాన టికెట్‌ లభిస్తుంది. బెస్టాఫ్‌లక్‌..!

బోనస్‌ టిప్‌: మీ సెర్చ్‌ చేసే బ్రౌజర్‌ను మెయిల్‌ ఐడీతో లాగిన్‌ అవుతుంటారు. ఇలాంటి సందర్భంలో లాగిన్‌ అవ్వకపోవడం మంచింది. ఎందుకంటే మీరు మొబైల్‌లో చెక్‌ చేసినా మెయిల్‌ ఐడీ ఆధారంగా మీ సెర్చ్‌ని సిస్టమ్‌ బ్రౌజర్‌ కూడా తీసుకుంటుంది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.