close

తాజా వార్తలు

కాగ్నిజెంట్‌లో 7,000 ఉద్యోగాల కోత..?

బెంగళూరు: అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం కాగ్నిజెంట్‌ సంస్థ వచ్చే మరికొన్ని త్రైమాసికాల్లో దాదాపు 7,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కంటెంట్‌ మోడరేషన్‌ వ్యాపారం నుంచి తప్పుకోనుండటంతో ఈ నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత జరిగే పునర్‌వ్యవస్థీకరణ ప్రభావం మరో 6,000 మంది ఉద్యోగులపై కూడా ఉండే అవకాశం ఉంది. 
పోస్టు ఎర్నింగ్‌ కాన్ఫరెన్స్‌ కాల్‌ సందర్భంగా కాగ్నిజెంట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం 10,000-12,000 మంది మధ్యశ్రేణి నుంచి సీనియర్‌ ఉద్యోగులకు ఉద్వాసన తప్పదని పేర్కొంది. మరో 5,000 మందికి మెరుగైన శిక్షణ ఇచ్చి ఇతర విధుల్లో చేరుస్తామని పేర్కొంది. 
‘‘కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో 2శాతం వరకు తగ్గించే అవకాశం ఉంది. ఈ మార్పులు మరో 6,000 మంది బాధ్యతలపై ప్రభావం చూపిస్తాయి. వారి బాధ్యతలు మారే అవకాశం ఉంది’’ అని కంపెనీ ఎగ్జిక్యూటీవ్‌ ఒకరు తెలిపారు. 
ప్రస్తుతం కాగ్నిజెంట్‌ కంటెట్‌ మోడరేషన్‌ వ్యాపారంలో ఫేస్‌బుక్‌ వంటి పెద్ద ఖాతాదారులకు సేవలు అందిస్తోంది. ఈ విభాగం నుంచి వైదొలగితే కంపెనీ కమ్యూనికేషన్‌, మీడియా, టెక్నాలజీ విభాగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.  


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.