close

తాజా వార్తలు

7లక్షల మందిని ఆదుకొన్న కంపెనీలు..

ముంబయి: దేశంలో ఆర్థిక మందగమనం నేపథ్యంలో  ఉద్యోగాలు కోల్పోయిన వారిలో దాదాపు 7 లక్షల మందిని కొత్తతరం పరిశ్రమలు ఆదుకొన్నాయి. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌, ఆహార సరఫరా సంస్థలు, ఆర్థిక సేవల సంస్థలు తాత్కాలిక ఉపాధి కల్పించాయి. ఆరు నుంచి ఎనిమిది నెలలపాలు ఈ ఉద్యోగాలు ఉండనున్నాయి. ఈ మొత్తం ఉద్యోగాల్లో 1,40,000ల ఉద్యోగాలను ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు సృష్టించాయి. ఈ సంస్థలు దేశంలోని చివరి ప్రదేశం వరకు డెలివరీ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో ఉద్యోగుల అవసరం పెరిగింది. 
విక్రయాల నెట్‌వర్క్‌లో 30శాతం ఉద్యోగాలను పెంచింది. ఇండియన్‌ స్టాఫింగ్‌ అసోసియేషన్‌ లెక్కల ప్రకారం 6,50,000 ఉద్యోగాలను ఈ పండుగ సీజన్లో సృష్టించినట్లు తేలింది. ‘‘కీలక రంగాల్లో డిమాండ్‌ తగ్గినా.. ఈ రంగాల్లో నియామకాలు జోరుగా జరిగాయి. ఈ నియామకాలు మొత్తం మూడు విభాగాల్లో జరిగాయి. డెలివరీ సిబ్బంది, అనుబంధ విభాగాలు, సరఫరా వ్యవస్థల్లో, విక్రేతల గోదాముల్లో ఈ నియామకాలు జరిగాయి ’’ అని ఇండియన్‌ స్టాప్ ఫెడరేషన్‌ అధ్యక్షురాలు రితుపర్ణ చక్రబర్తి పేర్కొన్నారు. వీరి జీతాలు రూ.30,000 వరకు ఉంటాయని అన్నారు. దీనిపై పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ 8,000 మంది  ఏజెంట్లకు అదనంగా మరో 5,000 మందిని నియమించుకొన్నామన్నారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.