close

తాజా వార్తలు

మళ్లీ సరికొత్త రికార్డులకు సెన్సెక్స్‌

ముంబయి: మదుపర్ల లాభాల స్వీకరణతో బుధవారం ఉదయం నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌మార్కెట్లు తిరిగి పుంజుకొని సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. ఓ దశలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 300 పాయింట్లు ఎగబాకి 40,606 వద్ద జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది. అటు నిఫ్టీ సైతం 50 పాయింట్లు లాభపడి 12000 మార్క్‌ను తాకింది. ప్రముఖ కంపెనీల షేర్లు పుంజుకోవడం, మరిన్ని ఉద్దీపన చర్యలకు ప్రభుత్వం నుంచి సంకేతాలు రావడమే మార్కెట్ల దూకుడుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మధ్యాహ్నం 2.21గంటల సమయంలో సెన్సెక్స్‌ 344 పాయింట్లు లాభపడి 40,592 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 80 పాయింట్లు ఎగబాకి 11,997 వద్ద ట్రేడవుతోంది. 

ఈరోజు బ్యాంకింగ్‌ రంగ షేర్లు దాదాపు ఒక శాతం మేర పుంజుకున్నాయి. అలాగే కంపెనీ పెద్దలపై వచ్చిన ఆరోపణల్ని ఇన్ఫోసిస్‌ తీవ్రంగా ఖండించింది. దీంతో ఇన్ఫీ షేర్లు ఓ దశలో మూడు శాతానికి పైగా లాభపడ్డాయి. అలాగే తదుపరి సంస్కరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి స్థిరాస్తి రంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ ప్రయత్నాలు చేస్తున్నాయని వెల్లడించారు. ఈ రంగాన్ని ప్రోత్సహిస్తే..ఇతర రంగాలపైనా సానుకూల ప్రభావం ఉండే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలకు తోడు చమురు ధరల్లో స్థిరత్వం, అమెరికా-చైనా వాణిజ్య విభేదాల పరిష్కారం దిశగా అడుగులు లాంటి సానుకూల సంకేతాలు మార్కెట్ల రికార్డులకు బాటలు వేశాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.