
తాజా వార్తలు
కోపోద్రిక్తుడై భార్యను హత్య చేసిన భర్త
ఆసిఫ్‌నగర్, న్యూస్‌టుడే: అమ్మాయికి పదిహేడేళ్లు నిండాయి, పెళ్లి చేద్దామని భర్త.. వద్దు ఇల్లు కొన్నాకే పెళ్లి, అని భార్య.. ఈ విషయమై కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం గొడవ తీవ్రతరం కావడంతో కోపోద్రిక్తుడైన భర్త భార్యను హతమార్చాడు. హబీబ్‌నగర్ ఠాణా పరిధిలోని మల్లేపల్లి, జెట్కేఫే వెనక బస్తీలో జరిగిన ఘటనపై ఇన్స్పెక్టర్ శివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకిలోని ఓ బీఫ్ షాప్‌లో పనిచేసే సలీం(40)కి ఇద్దరు భార్యలు. మొదటి భార్య తహేరాబేగం(35)తోపాటు ఇద్దరు కూతుళ్లతో కలిసి మల్లేపల్లిలో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. పెద్ద కూతురు(17)కు పెళ్లి చేద్దామని, తన వద్ద దాదాపు రూ.2లక్షల నగదు ఉందని భార్యకు సలీం కొద్దిరోజులుగా చెబుతూ వస్తున్నాడు. పెళ్లి ఇప్పుడే వద్దు ఇల్లు కొందామని తహేరాబేగం భర్తకు అడ్డు చెబుతూ వస్తోంది. ఇదే విషయమై గత కొద్దికాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి కూడా ఇద్దరు కూతుళ్ల సమక్ష్యంలోనే వారు గొడవ పడ్డారు. బుధవారం ఉదయం నిద్రలేవగానే తిరిగి గొడవ ప్రారంభమయ్యింది. దీంతో సహనం కోల్పోయిన సలీం కత్తితో తహేరాబేగంపై దాడి చేసి హత్య చేశాడు. హత్య అనంతరం ఇద్దరు కూతుళ్లను బజార్‌ఘాట్‌లో ఉండే తన రెండో భార్య వద్ద వదలిపెట్టి సలీం పారిపోయాడు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ శివచంద్ర సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీంను రంగంలోకి దింపి, ఆధారాలు సేకరించారు. పశ్చిమ మండలం అదనపు డీసీపీ ఎక్బాల్ సిద్దిఖీ, గోషామహల్ ఏసీపీ నరేంద్రరెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు. మృతురాలి ఇద్దరు కూతుళ్ల వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- పెళ్లే సర్వం, స్వర్గం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
