
తాజా వార్తలు
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృత రూపం దాల్చుతోంది. కార్యాచరణలో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లముట్టడికి ఐకాస పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పందించారు. హైదరాబాద్ సిటీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేవిధంగా ముట్టడిలకు పిలుపునిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంతమైన హైదరాబాద్ నగరంలో అలజడి సృష్టించవద్దని కోరారు. ఆర్టీసీ జేఏసి ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రుల నివాసం వద్ద భారీ భద్రతతో పాటు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రుల నివాసం వద్ద భద్రతను పర్యవేక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ, విదేశాల నుంచి చాలా మంది వ్యాపారాల నిమిత్తం ఇక్కడికి వస్తున్నారని, సమ్మెలు, రాస్తారోకో పేరుతో ప్రజలను ఇబ్బందిపెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రుల నివాసాల ముట్టడి మంచిది కాదని ఆయన హితవుపలికారు.
కొనసాగుతున్న నిరసనలు
ఉద్యమ కార్యాచరణలో భాగంగా కార్మికులు ప్రజా ప్రతినిధుల ఇళ్లముందు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం దేవరయాంజల్లో ఈటల ఇంటి ఎదుట.. హకీంపేట్, మేడ్చల్ జిల్లా డిపోల కార్మికులు నిరసన తెలిపారు. కార్మికుల ఆందోళనకు మంత్రి బయటకు రాగా.. వినతిపత్రం అందజేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మరోవైపు హన్మకొండలోని రాంనగర్‌లోని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటి ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళన కారులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. నిరసన కారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- రఘురామ కృష్ణరాజువిందుకు రాజ్‌నాథ్‌సింగ్
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
