
తాజా వార్తలు
ముంబయి: కొన్ని నెలలుగా ఆటో రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో అక్టోబరు నెలలో దేశీయంగా ప్రయాణికుల వాహన విక్రయాలు స్వల్పంగా పెరగడం కాస్త ఊరట కలిగిస్తోంది. అయితే ఇరత విభాగాల ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. మొత్తంగా ఆటో రంగ సంక్షోభం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్) తాజా నివేదిక ప్రకారం..
*ప్రయాణికుల వాహనాల అమ్మకాలు అక్టోబర్‌లో 0.28శాతం పెరిగాయి. గత అక్టోబరు నెలలో 2,84,223 యూనిట్లు అమ్ముడుపోగా.. ఈసారి ఆ సంఖ్య 2,85,027 యూనిట్లకు చేరింది.
* కార్ల అమ్మకాలలో 6.34శాతం క్షీణత నమోదైంది. 2018 అక్టోబరులో 1,85,400 యూనిట్లను విక్రయించగా.. ఈసారి అది 1,73,649కి పరిమితమైంది.
*మోటార్‌సైకిల్ విక్రయాలు 15.88శాతం తగ్గాయి. గత ఏడాది అక్టోబరులో 13,27,758 యూనిట్లు అమ్ముడుకాగా, ఈసారి అది 11,16,970 యూనిట్లకి తగ్గింది.
*ఇక ద్విచక్రవాహనాలు గత ఏడాది 20,53,497 యూనిట్లు విక్రయించగా.. ఈసారి 14.43శాతం క్షీణించి 17,57,264 యూనిట్లకు దిగజారింది.
*ఇక వాణిజ్య వాహనాల విక్రయాలు 23.31శాతం తగ్గి 66,773కి పరిమితమైంది.
*ఇక ఇతర విభాగాల్లో 12.76శాతం క్షీణత నమోదైంది. గత ఏడాది అక్టోబరులో 24,94,345 యూనిట్లు అమ్ముడుకాగా.. ఈసారి అది 21,76,136 యూనిట్లుగా నమోదైంది.
ప్రయాణికుల వాహనాలు మినహా మిగతా విభాగాల్లో ఆటో రంగ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. వరుసగా 12నెలలుగా అమ్మకాలు, ఉత్పత్తిలో క్షీణత నమోదైంది. పండగ సీజన్లో అయినా పుంజుకుంటుందని భావించినప్పటికీ.. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
