
తాజా వార్తలు
హైదరాబాద్: కాచిగూడ రైల్వేస్టేషన్లో సోమవారం జరిగిన ప్రమాదంలో క్యాబిన్లో చిక్కుకున్న ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని కేర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.సుష్మ వెల్లడించారు. ఈ మేరకు ప్రమాదంలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆమె హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. లోకోపైలట్ చంద్రశేఖర్ రెండు కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిందని, పక్కటెముకలు, మూత్రపిండం దెబ్బతిన్నాయని ఆమె తెలిపారు. అతడితోపాటు ప్రమాదంలో గాయపడిన శేఖర్, బేలేశ్వరమ్మ, రాజ్‌కుమార్, సాజిద్,మహ్మద్ ఇబ్రహీంకు వైద్యం అందిస్తున్నామని, వీరి ఆరోగ్య పరిస్తితి నిలకడగా ఉందని చెప్పారు.
సోమవారం ఉదయం లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు... సికింద్రాబాద్‌కు వస్తున్న హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం 10.42 గంటల ప్రాంతంలో ఎదురెదురుగా ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 18 మంది గాయాలపాలయ్యారు. హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రధాన లైను నుంచి లూపు లైను ద్వారా 4వ ప్లాట్‌ఫాం వైపు వస్తుండగా ఎంఎంటీఎస్ రైలు కాచిగూడ నుంచి ఫలక్‌నుమా వెళ్తూ వేగంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఎంఎంటీఎస్ నుంచి ఆరు బోగీలు గాల్లో లేచి పట్టాలు తప్పాయి.
లోకో పైలట్‌పై కేసు నమోదు
కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్రమాదానికి కారణమైన ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్‌పై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. కాచిగూడ స్టేషన్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చంద్రశేఖర్ ప్రస్తుతం నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకున్నాక అతని నుంచి వాంగ్మూలం తీసుకోవాలని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపైనా దర్యాప్తు చేస్తున్నారు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
