
తాజా వార్తలు
బయోడైవర్సిటీ పైవంతెనపై యువ చేష్టలు
రెండు ప్రాణాలు గాల్లో కలిసినా అప్రమత్తత ఏదీ?
శనివారం అర్ధరాత్రి 12.45 గంటలు.. అయిదారు రోజుల కిందట లాంఛనంగా ప్రారంభించిన బయోడైవర్సిటీ పైవంతెనపై ఇద్దరు యువకులు ఉత్సాహంగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. అంతలోనే వేగంగా దూసుకెళ్తున్న ఓ కారు ఒక్కసారిగా వారిని ఢీ కొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈనాడు, హైదరాబాద్
ఈ ఘటనతోనూ నగరవాసులు అప్రమత్తం కావడం లేదు. ట్రాఫిక్ ఇక్కట్లను తీర్చేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పైవంతెనను సెల్ఫీ స్పాట్‌గా మార్చేశారు. అటు, ఇటు తిరుగుతూ ఫొటోలు దిగుతుండటంతో ఒక్కసారిగా వేగాన్ని అదుపు చేయలేక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. క్షేత్రస్థాయిలో నిఘాను పటిష్ఠం చేసి కొరడా ఝుళిపించాల్సిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులేమో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెండోస్థాయి పైవంతెన..
ఖాజాగూడ నుంచి మైండ్‌స్పేస్ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లను తప్పించేందుకు వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక (ఎస్ఆర్డీపీ)లో భాగంగా బయోడైవర్సిటీ జంక్షన్లో రూ.69.47 కోట్ల అంచనా వ్యయంతో రెండు పై వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రెండోస్థాయి ఫ్లైఓవర్‌ను గత సోమవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ వంతెనతో మెహిదీపట్నం నుంచి కూకట్‌పల్లికి వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కొంత వరకు తీరాయి. ఖాజాగూడ నుంచి మెహిదీపట్నం, టోలిచౌకి మీదుగా హైటెక్సిటీవైపు వేళ్లేవారు సైతం జంక్షన్ వద్ద ఆగకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. ప్రస్తుతం ఈ మార్గంలో గంటకు 14వేల వాహనాలు నడుస్తున్నాయి.
ఏమవుతుందిలేననే ధైర్యంతో..
కొందరు యువకుల చేష్టల కారణంగా బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ప్రయాణం ప్రమాదకరంగా మారిందంటూ.. వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి మంచి వ్యూ కనిపిస్తుండటంతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా వివరిస్తున్నారు. ఫ్లైఓవర్‌పై ఎక్కడ పడితే అక్కడే ఫొటోలు దిగుతున్నారంటూ వాపోతున్నారు. అటు, ఇటు పరిగెడుతూ రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నారని చెబుతున్నారు. ఫొటోలు దిగడంలో నిమగ్నమై వేగంగా దూసుకొస్తున్న వాహనాలను కూడా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. మలుపుల దగ్గర ప్రయాణం ప్రమాదకరంగా మారిందంటూ వాపోతున్నారు. రాత్రి 10 గంటల తర్వాత పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందంటూ వివరిస్తున్నారు.
నిబంధనలపై అవగాహన లేమి..
నిబంధనల ప్రకారం ఈ పైవంతెనపై వాహనాల వేగం గంటకు 40 కి.మీలు మించరాదు. మూడు లేన్లలో ఎడమ వైపున్న మార్గాన్ని ద్విచక్రవాహనాలకు కేటాయించారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలుపరాదు. పాదచారులకు అనుమతి లేదు. ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. చాలా మంది వాహనదారులకు వీటిపై కనీస అవగాహన లేకపోవడంతో గాల్లో దూసుకెళ్తున్నారు. కార్లు, ఇతర వాహనాలు కూడా ద్విచక్రవాహనాలకు కేటాయించిన మార్గంలోనే దూసుకెళ్తుండటం గమనార్హం. ఎక్కడా కూడా నిబంధనలు, ఉల్లంఘనలకు జరిమానాలు తదితర అంశాలకు సంబంధించిన సూచిక బోర్డులు కనిపించడం లేదని వాహనదారులు పేర్కొంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలిపి సెల్ఫీలు దిగేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- నలుదిశలా ఐటీ
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- యువతిపై అత్యాచారం.. ఆపై నిప్పు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
