close

తాజా వార్తలు

కాచిగూడ ఘటనపై విచారణ ప్రారంభం

హైదరాబాద్‌ : కాచిగూడలో ఎంఎంటీఎస్‌ ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. రైల్వే సేఫ్టీ కమిషనర్‌ రామ్‌కృపాల్‌ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. విచారణలో స్టేషన్‌ మేనేజర్‌, డివిజన్‌ రీజనల్‌ మేనేజర్‌, అధికారులు పాల్గొన్నారు. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు, ప్రమాద సమయంలో పరిసర ప్రాంతాలవారిని కమిటీ విచారిస్తోంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఈ విచారణ కొనసాగనుంది. విచారణ అనంతరం ఘటనాస్థలిని కమిటీ సభ్యులు పరిశీలించనున్నారు. అనంతరం హైదరాబాద్ రైల్ భవన్‌లో కమిటీ మరోసారి రైల్వే ఉద్యోగులను విచారిస్తుంది. ఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందా..? మానవతప్పిదం వల్ల జరిగిందా? అనే విషయం విచారణలో వెల్లడికానుంది. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాచిగూడలో హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్‌ ఢీకొన్న విషయం తెలిసిందే.

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.