
తాజా వార్తలు
దిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా భారత్‌లో సరికొత్త బైకును విడుదల చేసింది. హోండా సీబీ షైన్ ఎస్పీ 125 మోటార్ సైకిల్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దిల్లీ ఎక్స్‌షోరూమ్‌లో దీని ధర రూ.72,900గా నిర్ణయించారు. భారత్ స్టేజ్-6 నిబంధనలకు అనుగుణంగా ఈ కొత్త బైకును రూపొందించారు. బీఎస్-6 నిబంధనలను అందుకున్న రెండో హోండా బైకుగా ఎస్పీ 125 నిలిచింది. ఇప్పటికే హోండా యాక్టివా బైకు బీఎస్-6 నిబంధనలను అందుకొంది.
కొత్త ఎస్పీ 125లో సరికొత్త ఫ్యూయల్ ఇంజెక్టెడ్ 124 సీసీ ఇంజిన్ లభిస్తుంది. కొత్త బైకు మరింత శక్తివంతంగా ఉండనుంది. ఈ బైకులో 19 పేటెంట్లు టెక్నాలజీలను వినియోగించారు. దీనిలో ఎల్ఈడీ డీసీ హెడ్ ల్యాంప్స్, సరికొత్త బాడీ వర్క్, సరికొత్త బాడీ గ్రాఫిక్స్, కొత్త రంగుల్లో దీనిని తీసుకువస్తోంది. ఈ బైకు డ్రమ్, డిస్క్ వేరియంట్లలో లభించనుంది. ఈ బైకులో స్టాప్ స్టార్ట్ సిస్టమ్‌ను అమర్చారు. సైడుస్టాండ్ తీయకుండా బండిని స్టార్టు చేయడానికి దీనిలో వీలుండదు. దీంతోపాటు ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్‌ను కూడా ఇచ్చారు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- వారంలో ఖతం
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
