
తాజా వార్తలు
ముంబయి: లవ్ బ్రేకప్‌పై తొలిసారి గోవా బ్యూటీ ఇలియానా స్పందించారు. ఆమె కొంతకాలం క్రితం లండన్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోస్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో కొన్నినెలల క్రితం విడిపోయారు. తాజాగా ఇలియానా ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. దీనిలో భాగంగా తన బ్రేకప్, సోషల్ మీడియాలో తన ప్రేమ గురించి వస్తున్న ట్రోల్స్‌పై ఇలియానా తొలిసారి మాట్లాడారు. ‘రిలేషన్ అంటే ఒకరికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. అది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది. ఆ ఇద్దరులో ఏ ఒక వ్యక్తి కూడా దాని గురించి మాట్లాడకూడదు. ఒకవేళ అలా కనుక మాట్లాడితే పరోక్షంగానే రెండో వ్యక్తి గురించి మాట్లాడిన వాళ్లం అవుతాం. ఎందుకంటే వాళ్లకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది. నా మీద సోషల్‌మీడియాలో వస్తున్న ట్రోల్స్ గురించి నేను పట్టించుకోవడం లేదు. కానీ, నాతో రిలేషన్లో ఉన్న వ్యక్తి మాత్రం అలా తీసుకోకపోవచ్చు. ప్రేమలో విఫలమైనందుకు ఇప్పుడు బాధపడటం లేదు. ఎందుకంటే ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నప్పుడే మన కుటుంబసభ్యుల, సన్నిహితుల విలువ మనకు అర్థమవుతుంది. నాకు అలాగే జరిగింది. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు మద్దతుగా నిలిచారు’ అని ఇలియానా తెలిపారు.
రామ్ కథానాయకుడిగా నటించిన ‘దేవాదాస్’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు గోవాబ్యూటీ ఇలియానా. తన అందం, అభినయంతో తొలి సినిమాతోనే ఎందరో అభిమానులను ఈ నటి సొంతం చేసుకున్నారు. లండన్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోస్‌తో ఆమె కొంతకాలంపాటు ప్రేమలో ఉన్నారు. అయితే, గడిచిన కొన్ని నెలల్లో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అంతేకాకుండా ఇన్‌స్టాలో ఇలియానా తన ప్రియుడు ఆండ్రూను ఆన్‌ఫాలో చేసింది. మరోవైపు ఆండ్రూ కూడా ఇలియానాను ఆన్‌ఫాలో చేశాడు. దీంతో వీరిద్దరు విడిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఇలియానా సోషల్‌మీడియాలో భావోద్వేగంతో కూడిన పోస్ట్‌లను పెట్టారు. ప్రస్తుతం ఆమె మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారు. బాలీవుడ్లో తెరకెక్కిన ‘పాగల్‌పంతీ’ చిత్రంలో ఆమె నటించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
