
తాజా వార్తలు
న్యూదిల్లీ: గల్ఫ్ ఎయిర్‌వేస్‌తో ఒక అవగాహన పత్రంపై స్పైస్ జెట్ నేడు సంతకం చేసింది. ఈ ఒప్పందంతో రెండు సంస్థల మధ్య బలమైన సమన్వయం సాధ్యమవుతుందని స్పైస్‌జెట్ పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం రెండు విమానయాన సంస్థలు ఇంటర్లైన్, కోడ్ షేరింగ్, రవాణ సేవల్లో సమన్వయం, ఇంజినీరింగ్ సేవలను, పైలట్ ట్రైనింగ్ వంటి అంశాల్లో పరస్పరం సహకరించుకోనున్నాయి.
‘‘ఈ భాగస్వామ్యం రెండు సంస్థలకు ప్రయోజనకరంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇది ప్రయాణికులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మధ్యప్రాచ్యం మాకు చాలా కీలకమైంది’’ అని స్పైస్‌జెట్ ఛైర్మన్, ఎండీ అజేయ్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం స్పైస్‌జెట్ 630 జాతీయ, అంతర్జాతీయ రోజువారీ సర్వీసులను నడుపుతోంది. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 118 విమానాలు ఉన్నాయి. వీటిల్లో 82 బోయింగ్ 737, 32 బంబార్డియర్ క్యూ-400, నాలుగు బీ737 బోయింగ్‌లు ఉన్నాయి.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌పై అక్షింతలు వేసిన అమెరికా
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
