
తాజా వార్తలు
దిల్లీ: ఆహారసరఫరా దిగ్గజమై స్విగ్గీతో చేతులు కలపనున్నట్లు వస్తున్న వార్తలను జొమాటో అధినేత దీపిందర్ గోయల్ ఖండించారు. విలీనంపై ఎటువంటి చర్చలను జరపడం లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో అతివేగంగా విస్తరిస్తున్న ఆహార సరఫరా రంగంలో దిగ్గజాలై ఈ రెండు సంస్థలు గత కొన్నేళ్లుగా వార్తొలస్తున్నాయి.
‘‘మేము మా వ్యాపారాన్ని విస్తరణపై దృష్టిని కేంద్రీకరిస్తున్నాము. లాభాలను ఆర్జిస్తున్నాము. విలీనం విషయమై మేం స్విగ్గీతోనే కాదు, ఎవరితోనూ చర్చలు జరపడం లేదు’’ అని జొమాటో ప్రతినిధి వివరించారు.
జొమాటో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,50,000 రెస్టారెంట్ల నుంచి ఆహారం సరఫరా చేస్తోంది. రోజుకు సగటున 1.3 మిలియన్ల ఆర్డర్లను స్వీకరిస్తోంది. మరోపక్క స్విగ్గీ భారత్‌లోని 500 నగరాల్లో తన సేవలందిస్తున్న జొమాటోకు గట్టి పోటీనిస్తోంది. గత ఆరు నెలల్లో 60,000 రెస్టారెంట్లతో వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇప్పటికే 1.4 లక్షల రెస్టారెంట్లతో లావాదేవీలను నిర్వహిస్తోంది. రానున్న మూడు సంవత్సరాలలో భారత ఆహార సరఫరా పరిశ్రమ వ్యాపారం పదిహేను బిలియన్ డాలర్ల వరకు అభివృద్ధి చెందనుంది.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
