
తాజా వార్తలు
న్యూదిల్లీ: రిలయన్స్‌కు చెందిన నెట్వర్క్18లో వాటాలను కొనుగోలు చేసే అంశంపై సోనీ చర్చలు జరుపుతోంది. దీనిపై ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పలు రకాల డీల్స్‌పై సోనీ పలురకాల డీల్స్‌ను దీనికోసం పరిశీలిస్తోంది. సోనీ తన భారతీయ విభాగం వ్యాపారాన్ని కూడా దీంతో కలిపే అవకాశం ఉంది. ఈ వార్తలు బయటకు రావడంతో గురువారం నెట్వర్క్18 షేర్లు దాదాపు 15శాతం ఎగశాయి. మరోపక్క టీవీ18 బ్రాడ్‌కాస్టింగ్ లిమిటెడ్ షేర్లు కూడా 9.7శాతం పెరిగాయి.
ఈ డీల్ ఇరుపక్షాలకు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్ వంటి వాటిని ఎదుర్కోవడానికి సోనీకి ఈ డీల్ ఎంతగానో ఉపయోగపడనుంది.. అదే సమయంలో అంతర్జాతీయ కంటెట్ వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి నెట్వర్క్18కు మంచి అవకాశం లభిస్తుంది. ‘‘మా కంపెనీ పలు అవకాశాలను పరిశీలిస్తోంది’’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వెల్లడించారు. మిగిలిన అంశాలపై స్పందించేందుకు నిరాకరించారు. సోనీ ప్రతినిధులు దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.