close

తాజా వార్తలు

డిసెంబర్‌ 25, 26న శ్రీవారి ఆలయం మూసివేత

తిరుమల, న్యూస్‌టుడే: సూర్యగ్రహణం వల్ల డిసెంబరు 25, 26 తేదీల్లో రెండు రోజుల్లో కలిపి 13 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబరు 26న ఉదయం 8.08 నుంచి 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. క్షేత్ర సంప్రదాయం ప్రకారం 6 గంటల ముందు అంటే 25న బుధవారం రాత్రి 11 గంటలకు ప్రధానాలయం తలుపులు మూసేస్తారు.

26, 27 తేదీల్లో ప్రత్యేక దర్శనం కోటా పెంపు
ప్రతి నెలా రెండు రోజులపాటు వృద్ధులు, చంటిపిల్లలున్న తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం కోటాను పెంచి అమలుచేస్తున్న తితిదే ఈ నెలలో 26, 27 తేదీల్లో ఈ అవకాశం కల్పించింది. 26న 65 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు 4 వేల టోకెన్లను మూడు స్లాట్‌లతో ఇవ్వనుంది. 27న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య ఐదేళ్లలోపు పిల్లలతో సహా తల్లిదండ్రులు ఆధార్‌కార్డుతో వస్తే నేరుగా సుపథం నుంచి ప్రధానాలయానికి అనుమతిస్తారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.