close

తాజా వార్తలు

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలివీ!

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. 

* వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకానికి రూ.1101కోట్లు కేటాయింపు. ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయం. 45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో రూ.75వేలు అందజేతకు కేబినెట్‌ ఆమోదం. 

* నవశకం సర్వే ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయం.

* కడప ఉక్కు పరిశ్రమకు ముడిసరుకు కోసం ఎన్‌ఎండీసీతో ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం. జమ్మలమడుగు మండలం పెదదండ్లూరు వద్ద 3,200 ఎకరాల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు.

* ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.

* ఏపీఎస్‌పీడీసీఎల్‌ను విభజించి సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు నిర్ణయం.

* సంక్షేమ పథకాలకు వేర్వేరు కార్డుల జారీకి కేబినెట్‌ ఆమోదం. రేషన్ కార్డుకు అర్హతలు మార్పు. 2,50,000 వార్షిక ఆదాయం, 10 ఎకరాలలోపు మాగాణి, 25 ఎకరాలలోపు మెట్ట ఉన్నవారు అర్హులు.

* జగనన్న వసతి దీవెన కింద రూ.2300కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద రూ.3400కోట్లు కేటాయింపు.

* ఒప్పంద ఉద్యోగుల అంశంపై కమిటీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం. 

* తితిదే పాలకమండలి సభ్యుల సంఖ్య 19 నుంచి 29కి పెంపు.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.