close

తాజా వార్తలు

న్యాయమూర్తి కావడం అరుదైన అవకాశం

జస్టిస్‌ జేకే మహేశ్వరి 

గుంటూరు: న్యాయమూర్తిగా తీర్పులు చెప్పే స్థాయిలో ఉండటం అద్భుతమైన, అరుదైన అవకాశమని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి అన్నారు. దైవం అశీస్సులు ఉన్న వారికే అలాంటి అవకాశం దక్కుతుందన్నారు. ఆ మహదావకాశాన్ని న్యాయమూర్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వేదికగా జరుగుతున్న న్యాయాధికారుల రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొని ‘విధులు-లక్ష్యాలు’ అనే అంశంపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏర్పాటు చేసిన సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తులు, అన్ని జిల్లాల న్యాయమూర్తులు పాల్గొన్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.