close

తాజా వార్తలు

దక్షిణాది నుంచి ప్రభాస్‌ ఒక్కడే..!

ఆసియా రొమాంటిక్‌ పురుషుల జాబితాలో యంగ్‌ రెబల్‌ స్టార్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ బాహుబలి ప్రభాస్‌కు అరుదైన ఘనత దక్కింది. ఆసియా సెక్సీయెస్ట్‌ పురుషుల జాబితాలో ఆయన 10వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ జాబితాలో దక్షిణాది నుంచి చోటు దక్కించుకున్న నటుడు ప్రభాస్‌ మాత్రమే కావడం విశేషం. ఇటీవల బ్రిటీష్‌ న్యూస్‌ వీక్లి, ఈస్ట్రన్‌ ఐ సంస్థలు సంయుక్తంగా ‘సెక్సీయెస్ట్‌ ఏషియన్‌ మ్యాన్‌ ఆఫ్ 2019’ సర్వేను నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల ఆన్‌లైన్‌ ఓట్ల ఆధారంగా చేసుకుని ఈ సర్వేను నిర్వహించారు. దీనికి సంబంధించిన జాబితాను బుధవారం ఆయా సంస్థల వారు లండన్‌లో విడుదల చేశారు. అయితే ఈ జాబితాలో బాలీవుడ్‌ నటుడు హృతిక్ రోషన్‌ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, ప్రభాస్‌ పదో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్‌ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు‌. ఆ సినిమా తర్వాత బ్యాంకాక్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అమరేంద్ర బాహుబలి రూపంతో ఉన్న ప్రభాస్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘సాహో’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ప్రభాస్‌ ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌కు జంటగా పూజాహెగ్డే కనిపించనున్నారు. మరోవైపు ఈ సినిమాలో కాజల్‌ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.