
తాజా వార్తలు
మల్యాల: అనుమానస్పదంగా ఉన్న ఓ యువకుడి వద్ద తుపాకీ లభించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శుక్రవారమే అతడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. విశ్వసనీయ వర్గాల ద్వారా శనివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా మల్యాల, కొడిమ్యాల పోలీసుల అదుపులో జనశక్తి నక్సలైట్‌గా భావిస్తున్న ఓ యువకుడు ఉన్నట్లు తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న యువకుడి వద్ద తుపాకీ లభించడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల సిరిసిల్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మావోయిస్టు మరాఠి నర్సయ్యను కూడా ఈ యువకుడు పలుమార్లు కలసినట్లుగా విశ్వసనీయ సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :