
తాజా వార్తలు
పాత ఏడాది మీరు చేయాలనుకుని చేయలేని పనులను ఈ సంవత్సరం చేసేయండి. ముఖ్యంగా మీ వైవాహిక బంధాన్ని బలోపేతం చేసే అంశాలపై దృష్టి పెట్టండి. అందుకోసం ఎలా ఉండాలో... ఉండకూడదో తెలుసుకోండి.
* మీ భాగస్వామి చేసే మంచి పనులను మెచ్చుకోవడం, అభినందించడం వల్ల మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. ప్రయత్నించి చూడండి.
* మీ వారికి తెలియకుండా అతడి ఫోన్‌ను చూడటం మీకు అలవాటా... వద్దు! అలా చేయడం వల్ల కొత్త సమస్యలకు తెర తీసినవారవుతారు. కాబట్టి అలాంటి పనులకు దూరంగా ఉండండి.
* లైంగిక జీవితానికి సంబంధించిన సమస్యలు మీ మధ్య ఉన్నాయా... వాటిని మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోండి. ఇలా చేయడం వల్ల మీ మధ్య అనుబంధం మరింతగా దృఢమవుతుంది.
* వీలైనంతవరకూ ఇతరులతో మీ భాగస్వామిని పోల్చకూడదు. దానివల్ల సమస్యలు పెరుగుతాయే తప్ప తగ్గవు. వివాహ బంధం ఒక పోటీ కాదు. ఈ విషయాన్ని అన్నివేళలా గుర్తుపెట్టుకుంటే సమస్యలు ఉండవు.
* అబద్ధాలు బంధాలను బలహీనం చేస్తాయి. పొరపాటుగా చెప్పే ఓ చిన్న అబద్ధం... దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరోటి... ఇంకోటి ఇలా అది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి అనుబంధంలో నిజాయతీనే ముఖ్యం అని ఇద్దరూ గుర్తుపెట్టుకోవాలి.
* అన్ని వేళలా భాగస్వామి మనల్నే అంటిపెట్టుకునే ఉండాలని అనుకోకూడదు. బంధంతోపాటు భాగస్వామికి ఇతర బాధ్యతలు కూడా ఉంటాయని మరవకూడదు. కాబట్టి ఎంత అన్యోన్యతగా ఉన్నా... భాగస్వామికి ఏకాంతానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.
* భాగస్వామిలో ఏదయినా సమస్య ఉందా... దానివల్ల మీరు బాధపడుతున్నారా... అయితే మౌనంగా ఉండిపోవద్దు. అవకాశం వచ్చినప్పుడు విమర్శించొద్దు. ఆ విషయాన్ని తనకు అర్థమయ్యేలా నేరుగా చెప్పండి. సమస్యను ఎలా పరిష్కరించాలనేది ఇద్దరూ కలిసి కూర్చుని ఆలోచించుకోవడం మంచిది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- వదిలేశారు..
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
