
తాజా వార్తలు
మా అమ్మానాన్న నా పెళ్లి సమయంలో పన్నెండు లక్షల రూపాయలను పెళ్లి కానుకగా ఇచ్చారు. ఈ డబ్బును నేను దీర్ఘకాలంపాటు పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నా. నష్టభయం లేకుండా మంచి మొత్తం రావాలంటే ఎందులో పెట్టుబడి పెట్టాలో చెప్పండి
- నందిత
* పెళ్లి కానుకగా వచ్చిన నగదును భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయాలనుకుంటున్నందుకు ముందుగా మీకు అభినందనలు. మీ డబ్బు సురక్షితంగా ఎలాంటి నష్టభయం లేకుండా ఉండాలంటే పీపీఎఫ్‌లో జమ చేయడమే ఉత్తమం. దీనికోసం మీరు మీ దగ్గరలోని పోస్టాఫీసులో ఖాతా తెరవొచ్చు. మీ డబ్బుకు భద్రత కూడా ఉంటుంది. ఏడు నుంచి ఎనిమిది శాతం వడ్డీ కూడా వస్తుంది. 80 సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచైనా మీరు దీన్ని నిర్వర్తించవచ్చు. న్యూ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) అనేది మరో కొత్త పథకం. దీన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. భద్రత, మంచి రిటర్న్స్‌తోపాటు పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీ ఎనిమిది నుంచి పదిశాతం వరకు పొందొచ్చు. కాబట్టి దీన్ని కూడా మీరు పరిశీలించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో డెట్ ఫండ్స్ అని ఉంటాయి. వీటిలో నష్టభయం చాలా తక్కువ. రాబడి కూడా బాగుంటుంది. వడ్డీ తొమ్మిది నుంచి పదకొండు శాతం వరకు ఉంటుంది. అయితే కొన్నిసార్లు హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఇవే కాకుండా కొన్ని ప్రభుత్వ బాండ్లను కూడా చూడొచ్చు. దీర్ఘకాలం పెట్టుబడి పెడతామంటున్నారు కాబట్టి కొంచెం రిస్క్ తీసుకుంటే మీకు అధిక మొత్తంలో రాబడి వచ్చే అవకాశముంది. మ్యూచువల్ ఫండ్స్‌లో డైవర్సిఫైడ్ అండ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ కూడా ఉంటాయి. వీటి గురించి కూడా ఓసారి సమగ్రంగా తెలుసుకోండి. పెట్టే పెట్టుబడి కాలం ఎక్కువ కాబట్టి నష్టభయం అంతగా ఉండకపోవచ్చు. అంతేకాదు రాబడి కూడా దాదాపు పది నుంచి పదిహను శాతం వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు కార్పొరేట్ బాండ్లను కూడా మీరు పరిశీలించవచ్చు. కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా మీ డబ్బును పెట్టుబడిగా పెట్టేందుకు ప్రయత్నించొచ్చు. ఆర్బీఐ బాండ్లు కూడా బాగుంటాయి. అయితే వీటిలో రిటర్న్స్ చాలా తక్కువ. గోల్డ్ బ్యాండ్, గోల్డ్ ఈటీఎఫ్‌లను కూడా చూడొచ్చు. వీటిలో రిటర్న్స్ తక్కువ. అలాగే డబ్బు మొత్తం ఒకేదానిలో కాకుండా రెండు మూడు పథకాల్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది.
మీ ప్రశ్నలు ఇకపై vasufin@eenadu.net కు పంపించగలరు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నా జీవితంలో అది భయంకరమైన జ్ఞాపకం’
- గొల్లపూడి తీరని కోరిక..!
- మాది గురుశిష్యుల సంబంధం
- ఎన్టీఆర్.. నానిలతో సినిమా చేయాలని ఉంది!
- గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
- రజనీ..జీవితంలో మర్చిపోలేని ఘటన అది!
- పట్టు చుట్టండి
- అతడు నిప్పు ఆమె మంచు
- ఈ మిలీనియల్స్ నాకు అర్థం కావట్లేదు!
- తెల్లసొన తెచ్చే మెరుపు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
