close

తాజా వార్తలు

చమక్కున మెరవాలంటే!
మేకప్‌ వేసుకోవాలని ఉన్నా...ఏం పొరబాటు చేస్తామో అని భయపడుతుంటారు చాలామంది. చిన్న చిన్న చిట్కాలతో...చమక్కున మెరవాలంటే... ఈ జాగ్రత్తలు తప్పనిసరి. !

* మేకప్‌ వేసుకునే ముందు తప్పనిసరిగా ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఏ చర్మతత్వం వారైనా సరే చర్మం తడి ఆరకముందే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఆ తరువాతే ఫౌండేషన్‌ వేసుకోవాలి. వీలైతే కాసేపు మర్దన చేసిన తరువాత ఫౌండేషన్‌ రాయాలి. వీలైనంతవరకూ లిక్విడ్‌, మాయిశ్చరైజర్‌ ఆధారిత ఫౌండేషన్‌ ఎంచుకుంటే బాగుంటుంది.

* పగటిపూట ఆరుబయట చిన్న చిన్న గేదరింగ్‌లు, పార్టీలు జరుగుతుంటాయి.. ఇలాంటప్పుడు లైట్‌ మేకప్‌ వేసుకోవాలి. లైట్ల వెలుతురులో నాలుగ్గోడల మధ్య జరిగే కార్యక్రమాలకు హాజరువుతుంటే కాస్త ఎక్కువగా వేసుకున్నా ఫర్వాలేదు.

* కళ్ల కింద నల్లటి వలయాలను కవర్‌ చేసేటప్పుడు కన్సీలర్‌ను పెన్సిల్‌తో రాసేయకూడదు. దాంతో చుక్కలు చుక్కలుగా పెట్టుకోవాలి. దాన్ని మొదట ఒక లేయర్‌లా పల్చగా వేయాలి. ఆ తరువాత మళ్లీ  ఇంకో లేయర్‌ వేయాలి. అలా వేయడం వల్ల ఎబ్బెట్టుగా అనిపించకుండా.. కన్సీలర్‌ చక్కగా సహజంగా అతికినట్టు కనిపిస్తుంది.

* చాలామంది ఫౌండేషన్‌ను ముఖానికి చక్కగా రాసేసుకుంటారు. అయితే చెవులు, మెడకు  ఏదో పేరుకు వేసుకుంటారు. కానీ ముఖానికి ఎలా జాగ్రత్తగా వేసుకున్నారో అలానే ఆ భాగాల్లో కూడా ఫౌండేషన్‌ రాసుకోవాలి. అప్పుడే చూడ్డానికి బాగా కనిపిస్తారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.