close

తాజా వార్తలు

చెమటకు చెదరకుండా...

వేసవిలో మేకప్‌ అంటే కాస్త అసౌకర్యంగానే అనిపిస్తుంది. కానీ ఈ కాలంలో వేడుకలు చాలానే ఉంటాయి. అందుకే సహజ అందానికి మేకప్‌ తోడవ్వడం తప్పనిసరే. అయితే చెమట, ఉక్కబోత వంటివాటివల్ల వేసుకున్న మేకప్‌ తొందరగా చెదిరిపోకూడదంటే...  కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

క్లెన్సర్‌: మేకప్‌ వేసుకోవడానికి ముందు నాణ్యమైన క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. క్లెన్సర్‌ అందుబాటులో లేనప్పుడు పచ్చిపాలల్లో కాస్త సెనగపిండి కలిపి ముఖానికి రాసుకుని శుభ్రం చేసుకోవచ్చు.

జిడ్డు లేకుండా: కొందరి చర్మం బాగా జిడ్డుగారుతుంది. అలాంటివారు ముందు ఆయిల్‌ ఫ్రీ ప్రైమర్‌ని రాసుకోవాలి. దీనిలో ఫేస్‌ ప్రైమర్‌, ఐ ప్రైమర్‌ అని విడివిడిగా ఉంటాయి. దేనికి దాన్నే వాడుకోవాలి. ఎస్‌ఫీఎఫ్‌ లేని ఫౌండేషన్‌ను ఈ కాలంలో వాడుకోవడం మేలు. లేదంటే వేసవి ఉక్కబోతకు ముఖం అంతా తెల్లగా ప్యాచ్‌లుగా కనిపిస్తుంది. ఈ కాలంలో  మేకప్‌ ఎంత తక్కువ ఉంటే అంత మంచిదనే ప్రాథమిక నియమాన్ని తప్పకుండా పాటించాలి.

కళ్లకు: దీనికి ప్రైమర్‌ వేశాక కాస్త జిడ్డుగా అనిపిస్తుంటే మ్యాటీ పౌడర్‌ అద్దాలి. ఇలా చేయడం వల్ల మేకప్‌ చాలా తాజాగా కనిపిస్తుంది. వాటర్‌ఫ్రూప్‌ ఐలైనర్‌, షాడో, మస్కారా, అండర్‌ ఐ కన్సీలర్‌లు వాడటం వల్ల ఐ మేకప్‌ ఎండకు కరగకుండా ఉంటుంది.

పెదాలు: ఈ కాలంలో పెదాలకు లిప్‌స్టిక్‌ వేసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తప్పదనుకుంటే ముందుగా పెదాలకు స్క్రబ్‌ చేసుకోవాలి. తరువాత లిప్‌బామ్‌ రాసుకోవాలి. అదయ్యాక పెన్సిల్‌తో లిప్‌లైన్‌ గీసుకుని లిప్‌గ్లాస్‌ వాడటం మేలు. తప్పదనుకుంటే గులాబీ, పీచ్‌, కోరల్‌ రంగులు ఎంచుకోవచ్చు.

సన్‌స్క్రీన్‌లోషన్‌: మేకప్‌ వేసుకునే ముందు... అంటే కనీసం గంట ముందు సన్‌స్క్రీన్‌లోషన్‌ వాడాలి. సన్‌స్క్రీన్‌ వాడాలనకునేవారు ఫౌండేషన్‌ క్రీమ్‌తో కలిపి రాసుకోవాలి. జిడ్డు చర్మం కలవారు మేకప్‌ వేసుకునేందుకు కొన్ని నిమిషాల ముందు... కాస్త సన్‌స్క్రీన్‌ పట్టించుకుంటే చాలు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.