Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 64352
            [news_title_telugu_html] => 

బరువు తగ్గించే 5 చిట్కాలు

[news_title_telugu] => బరువు తగ్గించే 5 చిట్కాలు [news_title_english] => Easy Weight Loss Tips You Can Try At Home [news_short_description] => బరువు తగ్గడం చాలా మందికి ఒక పెద్ద సవాలులాంటిది.. దీనికోసం కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఉదయం, సాయంత్రం వాకింగ్‌లు, జాకింగ్‌లు చేస్తూంటారు.... [news_tags_keywords] => weight loss, tips, experts [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-03-06 09:30:11 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బరువు తగ్గించే 5 చిట్కాలు - Easy Weight Loss Tips You Can Try At Home - EENADU
close

తాజా వార్తలు

బరువు తగ్గించే 5 చిట్కాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: బరువు తగ్గడం చాలా మందికి ఒక పెద్ద సవాలులాంటిది.. దీనికోసం కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఉదయం, సాయంత్రం వాకింగ్‌లు, జాకింగ్‌లు చేస్తూంటారు. గంటల తరబడి జిమ్‌ల్లో కుస్తీలు పడుతుంటారు. ఇంకొంతమంది మరొక అడుగు ముందుకేసి టీవీలు ముందు కూర్చొని టీవీ షోలలో వారు చెప్పే గోషాయి చిట్కాలు విని సమయాన్ని, డబ్బును వృథా చేసుకుంటుంటారు. అయితే వీటి ఫలితం కొంతమందికి కొన్ని నెలల్లో కనిపించవచ్చు. మరి కొందరికి కొన్ని సంవత్సరాల్లో బయటపడవచ్చు. ఇంకొందరికీ పూర్తిగా వీటి ప్రయోజనం ఉండకపోవచ్చు కూడా..

కొందరికి మెరుగైన జీవక్రియ ఉండం వల్ల బరువు తగ్గుదల సాధ్యమవ్వొచ్చు. మరికొందరికి ఇది సాధ్యం కాకపోవచ్చని ఒక నివేదికలో వెల్లడైంది. అతి బరువు నుంచి విముక్తి చెందాలంటే ఓపిక బాగా ఉండాలని నిపుణులు అంటున్నారు. దీని నుంచి బయటపడేందుకు నెమ్మదిగా ప్రయత్నించాలి. ఉదాహరణకు రాత్రిపూట భోజనంలో నాలుగు రోటీలు తినే వ్యక్తి అకస్మాత్తుగా ఒక రోటి తినడం ప్రారంభిస్తే ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎటువంటి వ్యాయామాలు, పరుగు,నడకలు అవసరం లేకుండా సులభంగా ఇంటి వద్దనే ఉండి బరువు తగ్గేందుకు నిపుణులు ఓ 5 చిట్కాలు చెప్తున్నారు. అవేంటో చూద్దాం....

చిరుతిళ్లకు దూరంగా..

బరువు తగ్గాలంటే ముఖ్యంగా స్నాక్స్‌ ( చిరుతిళ్లు)కు దూరంగా ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధ్యమైనంతవరకు మీరుండే ప్రదేశానికి దగ్గర్లో ఆహారపదార్థాలు లేకుండా చూసుకోవాలని చెప్తున్నారు. వంటకాలు మన కళ్లెదురుగా ఉంటే తినాలనే కోరిక కలుగుతుంది కాబట్టి ఈ చిట్కాను పాటించాలని వారు అంటున్నారు.

చిన్న పళ్లాల్లో ఆహారం తీసకోవాలి..

పెద్ద పళ్లాల్లో ఆహారం తీసుకోవడం వలన మీరు తక్కువే తింటారనే భావన కలుగుతుంది. ఎందుకుంటే పెద్ద పళ్లాల్లో ఆహారం ఎక్కువుగా కనిపిస్తే అదంతా తినలేమని, ఇంకొకరికి పెట్టాలని అనిపిస్తోంది. దీని వల్ల మనసులో తక్కువ తింటున్నామనే భావన కలుగుతోంది. అధునాతన పళ్లాల్లో భుజించడం వల్ల శరీరంలో అదనపు కేలరీల ఉత్పత్తి నివారించడానికి ఇది ఉపయోగపడుతోంది.

తొలి ప్రాధాన్యత కూరగాయలకే..

బరువు తగ్గాలంటే ఎక్కువుగా కూరగాయలే తినాలని నిపుణులు చెప్తున్నారు. కూరగాయలను ఉడకబెట్టుకొని తినాలని సూచిస్తున్నారు. మాంసపు పదార్థాల కంటే కూరగాయలే శరీరానికి మేలు చేస్తాయని, ఆరోగ్య సమస్యలను దరి చేరనివ్వవని అంటున్నారు. బరువు తరుగుదలకు కూడా ఇది ఉపకరిస్తోంది. గుడ్లు, మాంసపు పదార్థాల్లో ప్రోటీన్లు ఎక్కువుగా ఉంటాయని ఇవి శరీర బరువును పెంచుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

తక్కువ పంచదార వినియోగం..

బరువు తరుగుదలకు తీసుకోవాల్సిన మరో జాగ్రత్త పంచదారకు దూరంగా ఉండడం. పంచదార శరీరంలో కేలరీలను ఉత్పత్తి చేసి కొవ్వును ఏర్పరుస్తుంది కాబట్టి పంచదార ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదని వైద్యులు అంటున్నారు.

నెమ్మదిగా తినాలి..

అతి బరువు నుంచి విముక్తి పొందాలంటే మరో చిట్కా నెమ్మదిగా ఆహారం భుజించాలని వైద్యులు చెప్తున్నారు. బాగా నమిలి పదార్థాలను తినాలని అంటున్నారు. మెరుగైన జీవక్రియ బరువు తరుగుదలకు ఉపకరిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. తొందరగా తినడం వల్ల మితి మీరి ఆహారం తీసుకున్నా మెదడు దాన్ని గుర్తించదని, అందువల్ల కావల్సిన దానికంటే ఎక్కువ పదార్థాలను తినే ప్రమాదముందని నెమ్మదిగా తినాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.