close

తాజా వార్తలు

నిరూపించుకుంటేనే గుర్తింపు

ఆత్మవిశ్వాసంతోనే మహిళలు అన్నింట్లో రాణించగలరని అంటారీ ప్రముఖులు. ఈనాడు కుటుంబం పలు రంగాల్లోని మహిళలకు వసుంధర పురస్కారం అందించిన కార్యక్రమంలో జ్యూరీ సభ్యులుగా వ్యవహరించి తమ మనోభావాలు పంచుకున్నారిలా.

సాధారణంగా మహిళా వ్యాపారవేత్తలంటే... కిరణ్‌ మజుందార్‌ షా వంటి వారు గుర్తొస్తారు. జ్యూరీ సభ్యురాలిగా నా వద్దకు ఎన్నో మంచి కథనాలు వచ్చాయి. ఎక్కడెక్కడ వారినో గుర్తించి వారిని వసుంధర ద్వారా వెలుగులోకి తేవడం అభినందనీయం. ప్రతి మహిళ జీవితంలో ఓ కథ ఉంటుంది. అయితే కొందరి గురించి మాత్రమే బయట ప్రపంచానికి తెలుస్తుంది. అలానే మహిళల్లో ఫలానా రంగంలో ఇంత శాతం ఉన్నారు.. ఆ రంగంలో.. అంత శాతం ఉన్నారని లెక్కల్లో చెబుతారు. నా దృష్టిలో ప్రతి మహిళా ఉద్యోగినే. ఇక్కడ కొందరే జీతాలు తీసుకుంటారు. అదే తేడా. అలానే తక్కువ మందికే ప్రశంసలొస్తాయి. కానీ ఎవరికి వారే గొప్ప. మా నాన్న అపోలో వ్యవస్థాపకులు ప్రతాప్‌ సి రెడ్డి. ఆయనకి మేం నలుగురం ఆడపిల్లలం. మా ఇంటికొచ్చిన వాళ్లంతా ‘అమ్మో డాక్టర్‌ రెడ్డిగారికి నలుగురూ కూతుళ్లే’ అని అనేవారు. అది చూసి మా అక్కచెల్లెళ్లమంతా తప్పకుండా మమ్మల్ని మేం నిరూపించుకోవాలని అనుకున్నాం. అనుకున్నట్టే మగవాళ్లకు దీటుగా మా రంగాల్లో నిలబడ్డాం. ఇప్పుడంతా నాన్నని లక్కీ రెడ్డీగారూ అంటుంటారు.

- సంగీతారెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌
అపోలో హాస్పిటల్స్‌

క్రీడా రంగం నుంచి సింధు, సైనా అందుకున్న వసుంధర పురస్కారాలను సంతూర్‌ స్పాన్సర్‌ చేసింది.

 సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో ఒకే వయసువారో, లేదా ఒకే రంగానికి చెందిన వారో ఉంటారు. కానీ ఈ కార్యక్రమంలో మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రతిభను చూపించినవారు, ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన వారు, పురుషాధిక్యతగల రంగంలో వ్యాపారాల్లో దూసుకుపోతున్నవారు, డబ్బు వచ్చే వృత్తుల్లో ఉండి కూడా సామాజిక సేవ చేస్తున్నవారు ఎందరో అవార్డులు అందుకోవడం స్ఫూర్తిదాయకం. మహిళలు తమ గుర్తింపుకోసం ప్రయత్నించడం, తమకోసం సమయం కేటాయించుకోవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. భర్త కోసమో, పిల్లల కోసమో... అవసరం ఉన్నా లేకున్నా త్యాగాలు చేయడం మహిళలకు అలవాటు. దాన్ని మానుకోవాలి. అలా ప్రతిసారీ చేస్తూ పోతుంటే... కుటుంబంలో వారి స్థానం వెనకే ఉంటుంది.

           - శాంతకుమారి,  వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ 

  ఆడవాళ్లు చదువుకోవాలి. తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి. అప్పుడే వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అదే విషయం మా తాతయ్య అమ్మకి చెప్పారు. నాకు నాన్న చెప్పారు. నేను నా కోడలికి చెబుతాను..

- మంజులానాయుడు, దర్శకురాలు
 
 
 

మహిళల్లోని ప్రత్యేకతలను గుర్తించి అవార్డును అందివ్వడం గొప్ప విషయం. ఆ ప్రయత్నానికి నా అభినందనలు. నాకు ఈ గౌరవాన్ని అందించినందుకు కృతజ్ఞతలు. ప్రతిఒక్కరూ మున్ముందు మరెన్నో పురస్కారాలు అందుకోవాలని, మరెంతో మందికి స్ఫూర్తిని అందించాలని కోరుకుంటున్నా.

     - అమల, నటి 

వసుంధర అవార్డు పేరులోనే సానుకూలత కనిపిస్తుంది. వాళ్లు ఎంతో కష్టపడితేనే కానీ ఈ స్థాయికి చేరుకోలేరని నా అభిప్రాయం. 

- జయసుధ, నటి

పురస్కారం ఒకరికే సొంతం. అలాగని మిగతావాళ్లకి గుర్తింపు లేదని కాదు. ఎవరిస్థాయిలో వాళ్లే విజేతలు.

- డాక్టర్‌ బాలాంబ, గైనకాలజిస్టు

ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదు. వాళ్లు అనుకుంటే ఏదయినా చేయగలరు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని విజయాలు సాధించగలరు.  అందుకు ఈ గుర్తింపే నిదర్శనం. 

- శ్రీలేఖ, సంగీత దర్శకురాలు

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.