Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 66469
            [news_title_telugu_html] => 

స్వచ్ఛనారీలు!

[news_title_telugu] => స్వచ్ఛనారీలు! [news_title_english] => [news_short_description] => స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగంగా కేంద్రం స్వచ్ఛమైన నగరాల జాబితాలను విడుదల చేసింది. అందులో స్వచ్ఛ ర్యాంకు అందుకున్న టాప్‌ పది నగరాల్లో తిరుపతికీ చోటు దక్కింది.  ఈ స్వచ్ఛత వెనక ఓ పద్దెనిమిది మంది మహిళల శ్రమ దాగుంది. మరి ఆధ్యాత్మిక నగరిని అంత స్వచ్ఛంగా ఉంచిన ఆ శ్రమజీవులు ఎవరు..  ఏం చేశారో తెలుసుకోవాలంటే చదివేయండి... [news_tags_keywords] => Mahila jayaho, Swacha city, Tirupathi, Inspiring Sweepers, Vasundhara special page [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | | [news_videoinfo] => | | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-03-12 00:54:37 [news_isactive] => 1 [news_status] => 2 ) )
స్వచ్ఛనారీలు! - EENADU
close

తాజా వార్తలు

స్వచ్ఛనారీలు!

స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగంగా కేంద్రం స్వచ్ఛమైన నగరాల జాబితాలను విడుదల చేసింది. అందులో స్వచ్ఛ ర్యాంకు అందుకున్న టాప్‌ పది నగరాల్లో తిరుపతికీ చోటు దక్కింది.  ఈ స్వచ్ఛత వెనక ఓ పద్దెనిమిది మంది మహిళల శ్రమ దాగుంది. మరి ఆధ్యాత్మిక నగరిని అంత స్వచ్ఛంగా ఉంచిన ఆ శ్రమజీవులు ఎవరు..  ఏం చేశారో తెలుసుకోవాలంటే చదివేయండి.
స్వచ్ఛత విభాగంలో  తిరుపతి జాతీయ స్థాయిలో మొదటిర్యాంకు సాధించింది.
నగరం నిద్రపోతున్న వేళ్ల.. ఆ పద్దెనిమిది మంది తిరుపతిలోని 22 ప్రధాన రహదార్లను శుభ్రం చేస్తుంటారు. రోడ్లపై చెత్త లేకుండా... దుమ్ము కనిపించకుండా చేసి, చెత్తను డంపర్‌బిన్లలో వేస్తారు. తెల్లవారుజామున తొమ్మిదొందల మంది పారిశుద్ధ్యం కార్మికులు విధుల్లోకి చేరేలోపు తమ పని కానిచ్చేసి వెళ్లిపోతారు. దాంతో వారు డంపర్‌బిన్లలో చెత్తను దూరంగా తరలిస్తారు. అలా తెల్లవారు జామున వాకింగ్‌కు వెళ్లేవారికి రోడ్లలన్నీ ఎంతో స్వచ్ఛంగా కనిపిస్తుంటాయి. అంతేకాదు స్వచ్ఛసర్వేక్షణ్‌ ప్రజాభిప్రాయ సేకరణలో నగర    వాసులు మంచి ఫీడ్‌ బ్యాక్‌ ఇచ్చారు. అందుకే ప్రజల సమీక్షా విభాగంలో తిరుపతికి జాతీయ స్థాయిలో మొదటిర్యాంకు వచ్చింది.

హాజరుశాతం సూపర్‌... రోడ్లను ఊడ్చే ఈ 18 మంది మహిళలను డ్వాక్రా గ్రూపుల నుంచి తీసుకున్నారు. వీరికి నెలకు రూ.12 వేలు వేతనం. వీరిలో ఓ ఎనిమిది మాత్రం సంవత్సరంలో ఐదు రోజుల కంటే తక్కువ సెలవులు తీసుకున్నారు. వీరికి నగరపాలక సంస్థ గతంలో సన్మానం చేసింది. ప్రస్తుతం వీరికి తోడుగా పారిశుద్ధ్య యంత్రాలు వచ్చాయి. దీనివల్ల నగరం మరింత అందంగా కనిపిస్తోంది. సెలవులు లేకుండా, పనిని క్రమపద్ధతిలో పంచుకుంటూ ఎక్కడా ఏ ఫిర్యాదు లేకుండా గత దశాబ్ద    కాలంగా రోడ్లను శుభ్రం చేస్తున్నారు.
ఆకతాయిలొస్తే ఏకమవుతారు... వీరంతా మూడు బృందాలుగా విడిపోయి పనిచేస్తారు. అయితే రాత్రి వేళల్లో ఆకతాయిల బాధ ఉంటుంది. తాగుబోతులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఆ సమయంలో మిగతా బృందసభ్యులూ బాధితులకు అండగా ఉండి స్పందిస్తారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే, మిగతా వారు వచ్చి ఆకతాయిలకు సరైన సమాధానం చెబుతారు. ఏదైనా సమష్టిగా ఎదుర్కొంటామని చెబుతున్నారు. వీళ్లకి అధికారులు తగిన సామగ్రి, దుస్తులను అందజేసి... వారికి సాయపడతారు.

- శివ మావూరి, ఈనాడు, తిరుపతి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.